Varun Teja – lavanya Tripathi: పార్టీలో వరుణ్ తేజ లావణ్య త్రిపాఠి సందడి.. అందుకోసమే వెళ్లారట

Varun Teja – lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇక వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారంటూ వచ్చే కథనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగబాబు సైతం తన కొడుకు పెళ్లి మీద విపరీతమైన సెటైర్లు వేస్తుంటారు. వరుణ్ తేజ్ పెళ్లి గురించి నెటిజన్లు అడిగినప్పుడల్లా ఏదో ఒక కౌంటర్ వేస్తాడు. వాడు ఎవరిని చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు.. వాడి పెల్ళి వాడిష్టం అన్నట్టుగా నాగబాబు చెబుతుంటాడు. అయితే వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నది లావణ్య త్రిపాఠితోనేంటూ రూమర్లు చక్కర్లు కొడుతుంటాయి.

ఈ ఇద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు చేశారు. అలా మొత్తానికి మెగా ఫ్యామిలీకి లావణ్య దగ్గరైంది. లావణ్య వరుణ్ తేజ్‌ల మీద ఈ రేంజ్‌లో రూమర్లు రావడానికి చాలా కారణాలే చూపిస్తుంటారు నెటిజన్లు. నిహారిక లావణ్య త్రిపాఠి కలిసి బాగా తిరుగుతుంటారని, ఆ మధ్య డెహ్రాడూన్ ట్రిప్ కూడా వేశారని, ఈ ఇద్దరూ జిమ్ మేట్స్ కూడా అని అంటుంటారు. అలా తనకు వదిన అవుతుంది కాబట్టే ఇంత క్లోజ్‌గా తిరుగుతోందని చెబుతుంటారు. ఇక నిహారిక పెళ్లిలో లావణ్య త్రిపాఠి సందడి చేసింది.

ఆ సమయంలోనూ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ప్రేమ కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ ఒకే చోట కలిశారట. ఓ పార్టీలో ఈ ఇద్దరూ సందడి చేశారట. ఈ ఫోటోలు బయటకు రావడంతో మరోసారి చర్చకు దారితీసినట్టు అయింది. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, పెళ్లి చేసుకోబోతోన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ వారిద్దరూ ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో కలిశారట.

ఓ కామన్‌ ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీలో వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి సహా నితిన్‌ ఆయన భార్య షాలినీ, సాయి ధరమ్‌ తేజ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యరు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలే ఇప్పుడు ఈ ఇద్దరి ప్రేమ, పెళ్లి వార్తలకు కారణం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -