Vibrant Survey: ఏపీలో అధికారం కూటమిదే అని తేల్చి చెప్పిన వైబ్రంట్ సర్వే.. అన్ని స్థానాలు వస్తాయా?

Vibrant Survey: ఏపీలో కూటమిదే విజయమని చాలా సర్వేలు చెబుతూ వస్తున్నాయి. ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుంది అనే విషయంలోనే ఒక్కో సర్వే ఒక్కోలా చెబుతుంది కానీ.. ఈసారి వైసీపీకి ఓటమి ఖాయమని చెబుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఈ సర్వే ఫలితాలు అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ సర్వేలతో అంతోఇంతో గెలుస్తామనే నమ్మకం ఉన్న అభ్యర్థులు కూడా వారి నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఏపీలో మరో సర్వే ఫలితం అధికార వైసీపీని టెన్షన్ పెడుతుంది. ప్రముఖ సర్వే సంస్థ వైబ్రెంట్ ఇండియా కూడా ఏపీలో కూటమిదే అధికారం అని తేల్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తుందని తేల్చింది.

వైబ్రెంట్ ఇండియా ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం 50 వేల 236 మంది అభిప్రాయాలను సేకరించింది. మరో 50 వేల మందిని అభిప్రాయాలను ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంది. అంటే ఏకంగా లక్ష మంది అభిప్రాయాలు తెలుసుకుంది. అంటే లక్ష శాంపిల్స్ అంటే చిన్న విషయం కాదు. వైబ్రంట్ ఇండియా సర్వే ప్రకారం కూటమి అభ్యర్థులు 79 స్థానాల్లో ఈజీగా గెలుస్తారని తేల్చింది. మరో 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపునకు ఎడ్జ్‌లో ఉన్నారని ఈ సర్వేలో తేలింది. అంటే.. 99 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెలుస్తోంది. వైబ్రెంట్ ఇండియా సర్వే ప్రకారం వైసీపీ కేవలం 29 స్థానాల్లోనే సునాయాసంగా గెలుస్తుంది. అన్ని అంశాలు కలిసి వస్తే మరో 18 స్థానాల్లో గెలవడానికి ఛాన్స్ ఉంది. మిగిలిన స్థానాల్లో వైసీపీకి, కూటమి అభ్యర్థులకు మధ్య హోరాహోరి పోటీ ఉంటుంది. అంటే.. 115 నుంచి 120 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిస్తే.. వైసీపీ 60 లోపు స్థానాలకు పరిమితం అవుతుంది. చిత్తూరు, కడప, ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది. మిగిలిన జిల్లాలు అన్ని మెజార్టీ స్థానాలు టీడీపీ కూటమి ఖాతాలో పడతాయి.

ఇక, ఓటింగ్ విషయానికి వస్తే.. టీడీపీ కూటమికి 42.26శాతం, వైసీపీకి 38.11శాతం వస్తుంది. 13.47శాతం ఓటింగ్ సైలంట్ గా జరుగుతుంది. వారిని అంచనా వేయడం కష్టంగా ఉంది. ఇతరులకు 6.16శాతం ఓటింగ్ వెళ్తుందని వైబ్రెంట్ ఇండియా సర్వే తేల్చింది. వైబ్రంట్ ఇండియా సర్వేకు దేశవ్యాప్తంగా చాలా పాపులారిటీ ఉంది. గతంలో 14 సార్లు ఈ కంపెనీ సర్వే నిర్వహించగా.. 12 సార్లు తుది ఫలితాలను అద్దం పట్టేలా సర్వే ఫలితాలు ఉన్నాయి.

తెలంగాణలో 2018లో టీఆర్ఎస్ పార్టీకి 72-78 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్నికల ఫలితాల్లో 88 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 67 – 75 స్థానాలు వస్తాయని తెలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చాయి. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 118-130 స్థానాలు వస్తాయని ఈ సంస్థ సర్వేలో తేలింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో ఏపీలో వైసీపీకి 129 -139 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఫలితాల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి. ఇంత కచ్చితమైన సర్వే సంస్థ ఇప్పుడు కూటమికి గెలుపు ఖాయమని చెప్పడంతో.. వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -