Vijay – Rashmika: వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ, రష్మికల మార్ఫింగ్ పెళ్లి ఫోటో!

Vijay – Rashmika: సాధారణంగా సినిమా రంగంలో ప్రేమాయణాలు అనేవి చాలా కామన్. ఇవి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పైగా చిత్ర సీమలో ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పలువురు సెలెబ్రిటీలు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. వారి గురించి పోస్ట్ లు పెడుతూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఒకప్పుడు అయితే టీవిలో వచ్చే వార్తల్లోనో లేక న్యూస్ పేపర్స్ లోనో ఇవి చూసే వాళ్ళం. ఇప్పడు అయితే నిమిషాల్లో ఎం జరుగుతుందో తెలిసిపోతుంది.

అలా సోషల్ మీడియా ఒకందుకు మంచిదే అయినా కానీ రూమర్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇక ఈ కాలం ప్రేమాయణాల గురించి మాట్లాడుకుంటే రెండు సినిమాలు తీశారో లేదా ఇద్దరు కలిసి స్నేహంగా తిరిగితే చాలు వారిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనే వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యే విజయ్ దేవరకొండ మరియు రష్మిక కి సంబంధించిన ఒక ఫోటో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగా పూల మాలలు ధరించి ప్రత్యక్షమై ఒక్క సారిగా షాక్ కి గురి చేశారు.

అయితే నిజం చెప్పాలంటే వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. గీత గోవిందంలో వీళ్ళు నటించిన తీరు అద్భుతం. నిజంగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండేది అని అప్పట్లో చాలా మందే అనుకున్నారు. ఇక తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో వీళ్లిద్దరు కలిసిన నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయిపోయారు కానీ సమయం దొరికినప్పుడల్లా వీళ్లిద్దరు కలిసి టూర్లకు వెళ్తూ మా స్నేహం రెండు సినిమాలతోనే ఆగిపోలేదు అంటూ చెప్పకనే చెప్తారు.

అయితే ఇద్దరు హీరో హీరోయిన్లు కలిసి ఇలా బహిరంగంగా తిరుగుతుంటే ఖచ్చితంగా రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇక ఈ సారి మాత్రం ఏకంగా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగా ఫోటో ని విడుదల చేసారు. కానీ నిజం చెప్పాలంటే వేరే ఫోటో కి విజయ్ దేవరకొండ మరియు రష్మీక ఫేసెస్ ని మార్ఫింగ్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక కొంత మంది అయితే వీరిద్దరికి నిజంగానే పెళ్లి అయిపోయిందేమో అని అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -