Vijay Devarakonda: రామ్ చరణ్ ఎన్టీఆర్ కంటే విజయ్ దేవరకొండ పారితోషికం ఎక్కువా.. ఏమైందంటే?

Vijay Devarakonda: మాములుగా హీరో,హీరోయిన్లు డైరెక్టర్లు సినిమా సినిమాలకు పారితోషికం ఎక్కించడం తగ్గించడం అన్నది కామన్. వరుసగా రెండు మూడు హిట్ సినిమాలు పడ్డాయి అంటే హీరో హీరోయిన్లు కచ్చితంగా వారి పారితోషికాలను ఊహించని విధంగా పెంచేస్తూ ఉంటారు. అగ్ర హీరోలు మాత్రమే కాకుండా నిన్న గాక మొన్న వచ్చిన చిన్న హీరోలు కూడా నిర్మాతలను భారీ స్థాయిలో రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక కాస్త మీడియం రేంజ్ ఉన్న హీరోలు అయితే టాప్ స్టార్స్ రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు.

వారిలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో హోదాని దక్కించుకున్నారు. యూత్ లో అయితే బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇక గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో రేంజ్ వసూళ్లను రాబట్టాడు విజయ్ దేవరకొండ. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ చిత్రానికి గాను విజయ్ దేవరకొండ ఏకంగా 35 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాకి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంతకంటే తక్కువ రెమ్యూనరేషన్స్ అందుకున్నారు.

 

కేర్ ఆఫ్ అడ్రస్ లేని విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ కి వచ్చిన 5 ఏళ్లలోపే ఈ రేంజ్ కి ఎదిగాడంటే, ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగిలితే ఇక ఆయన ఏ రేంజ్ లో వేళ్తాడో ఊహించుకోవచ్చు. ఖుషి సినిమా కనక సూపర్ హిట్ అయితే నెక్స్ట్ సినిమాకు విజయ్ దేవరకొండ తన పారితోషికాన్ని మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఖుషి మూవీ ఎలాంటి ఫలితాలను రాబడుతుందో తెలియాలి అంటే సెప్టెంబర్ 1 వరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -