Vijay Devarakonda: ఏడాదిన్నర నుంచి అలాంటి కష్టాలు ఎదుర్కొంటున్న రౌడీ హీరో?

Vijay Devarakonda: రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ మొదటిసారి నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఈనెల 25వ తేదీ విడుదల కావడంతో ఎక్కడ చూసినా ఈ సినిమా హంగామే కనపడుతుంది. ఒకవైపు హీరో హీరోయిన్లు ప్రమోషన్ చేయగా మరోవైపు దర్శక నిర్మాతలు ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఈ సినిమాలో నటించినటువంటి ఇతర నటీనటులు కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

సాధారణంగా ఒక సినిమా తెరకేక్కుతుంది అంటే ఆ సినిమాలో పాత్రకు అనుగుణంగా హీరో తన శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల విషయంలో మాత్రం శరీర ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తమ పాత్రకు అనుగుణంగా శరీరాన్ని మార్చుకోవడం కోసం హీరోలు ఎన్నో త్యాగాలను చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం గత ఏడాదిన్నర నుంచి ఎన్నో త్యాగాలు చేశారని తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాలో ఈయన తన శరీర ఫిట్నెస్ పెంచుకోవడం కోసం ఏకంగా ఏడాదిన్నర పాటు మంచి డైట్ ఫాలో కావడమే కాకుండా, ప్రతిరోజు జిమ్ లో గంటలు తరబడి వర్క్ అవుట్ చేస్తూ ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఈ సినిమాలో తన బాడీ సరైన ఫిట్నెస్ రావడం కోసం ఏడాదిన్నరగా ఈయన మందు కూడా మానేశానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలా ఈ సినిమా కోసం ఈయన పడిన కష్టాలన్నింటిని చెప్పడంతో ఒక్క సినిమా కోసం ఈయన ఇన్ని త్యాగాలు చేశారా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఈ సినిమా కోసం ఇంత కష్టపడుతూ ఇన్ని త్యాగాలు చేసిన విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఏ విధమైనటువంటి విజయం అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -