Vijaya Sai Reddy: నెల్లూరుకు విమానాశ్రయం, ఐటీ కంపెనీలు.. విజయసాయి హామీలు హద్దులు దాటుతున్నాయా?

Vijaya Sai Reddy: ఎరక్క ఇరుక్కుపోయారో.. తప్పించుకోలేక చిక్కుకున్నారో తెలియదు కానీ.. విజయసాయిరెడ్డి పరిస్థితిని చూస్తే ప్రత్యర్థికి సైతం జాలి అనిపిస్తోంది. విజయసాయిరెడ్డికి విజయసాయి రెడ్డికి ప్రత్యక్ష రాజకీయాలు అలవాటు లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. ఓరకంగా చెప్పాలంటే.. వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డి ట్రబుల్ షూటర్ లాంటివారు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. కేంద్రపెద్దలతో వైసీపీకి ఇంత సఖ్యత ఉంది అంటే ఆయనే కారణం. కేంద్ర పెద్దల దగ్గర ఆయన చేసే లాబీయింగ్ అంతా ఇంతా కాదు. విజయసాయిరెడ్డి వ్యూహాల పుణ్యమే.. వైసీపీకి, జగన్ కు, ఆ పార్టీ నేతలకు కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి నెల్లూరు ఎంపీగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు విజయసాయిరెడ్డిని చూస్తున్న ప్రత్యర్థులు సైతం అయ్యో పాపం అంటున్నారు.

ఇటీవల ఉదయగిరిలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. సీతారామపురంలో ప్రచారం రథంపై ఆయన ప్రసంగం మొదలు పెట్టకుండానే ప్రజలు వెళ్లిపోతున్నారు. దీంతో.. వైసీపీ నేతలు ఆగండి.. ఆగండి బోజనాలు ఉన్నాయి.. తిని వెళ్లండి.. కాసేపు వెనక్కి రండి అని పిలుస్తున్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడేవరకూ ఆగండమ్మ రండీ అని పిలుస్తున్నారు. ఈ వీడియోలు చూసిన వారికి ఎవరైకా మొదటి నవ్వు వస్తుంది. తర్వాత విజయసాయిరెడ్డిపై జాలి అనిపిస్తుంది. విజయసాయిరెడ్డి చాలా తెలివైన వ్యక్తి. ఆయన ఓ ఎంపీ అభ్యర్థి కాదు. వెనకుండి పార్టీని నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ప్రజల నుంచి ఇలాంటి అవమానం రావడం నిజంగా ఎవరికైనా జాలి అనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. పార్టీ అధ్యక్షుడి రేంజ్ లో ఆయన ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు. తననను గెలిపిస్తే నెల్లూరు జిల్లాకు ఐటీ కంపెనీలు తీసుకొని వస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఫార్మా కంపెనీలకు ఉన్న అన్ని సమస్యలు తీర్చేస్తానని చెబుతున్నారు. అంతేకాదు.. నెల్లూరులో విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అయితే.. నెల్లూరులో తనను గెలిపిస్తే అది చేస్తా.. ఇది చేస్తా అని చెబుతున్నారు. కానీ, గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు వైసీపీయే గెలిచింది. మరి గత ఐదేళ్లలో ఎందుకు నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయలేదు? ఐటీ కంపెనీలు ఎందుకు తీసుకొని రాలేదు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ఏం చేయలేదనే నెల్లూరు వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారు. నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న నేతలంతా టీడీపీ గూటికి చేరిపోయారు. గతసారి జిల్లాల్లో అన్ని స్థానాలు గెలిపించినా.. జిల్లాకు ప్రభుత్వం ఏం చేయలేదనే అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేశారు. నెల్లూరు జిల్లాను అభివృద్ది చేస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నేతలు ఎందుకు తిరుగుబాటు చేస్తారు? విజయసాయిరెడ్డి ఎందుకు నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సి వస్తుంది? నెల్లూరులో వైసీపీకి అభ్యర్థులు కూడా లేరు కాబట్టి విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. ఇప్పుడు మరోసారి అది చేస్తాం.. ఇది చేస్తామంటే జనం నమ్మేస్తారా?

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -