Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త న్యూస్ ఛానెల్.. మరో సాక్షి ఛానెల్ రెడీ

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి ప్రవేశపెట్టనున్నారు. తెలుగులో కొత్త మీడియా ఛానెల్ పెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. విశాఖలో రైతులను బెదిరించి వారి నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వేస్తున్నాయి. విశాఖ చుట్టుపక్కల చాలా భూములను తన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరుతో విజయసాయిరెడ్డి కొనుగోలు చేసిట్లు సర్వే నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ తో సహా మీడియాలో వస్తున్నాయి. దీంతో తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు మీడియా ముందుకొచ్చిన విజయసాయిరెడ్డి.. త్వరలో తాను కూడా సొంతంగా మీడియా ఛానెల్ ఏర్పాటు చేయబోతుున్నట్లు ప్రకటించారు.

మీడియాలో తనపై ఇచ్చమొచ్చినట్లు రాస్తున్నారని, రామోజీరావు తన పత్రిక ఈనాడు, ఛానెల్ ఈటీవీలో తనపై అవాస్తవాలు రాస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాను కూడా రామోజీరావుకు పోటీగా కొత్త న్యూస్ ప్రారంభిస్తానంటూ చెప్పుకొచ్చారు. రామోజీరావుకు కౌంటర్ ఇచ్చేందుకే మీడియా రంగంలోకి వస్తున్నట్లు బహిరంగా ప్రకటించారు. ఏపీలోనే కొత్త ఛానెల్ పెడతానంటూ చెప్పుకొచ్చారు. మీడియాలో తన పాత్రను బలంగా చూపించుకుంటానంటూ చెప్పుకొచ్చారు. సాక్షి న్యూట్రల్ గా ఉంటుందని, అది వైసీపీకి చెందని మీడియా కాదంటూ విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం.

విశాఖలో తనకు త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ తప్పితే ఏమీ లేవని, రామోజీరావు కావాలనే తన మీడియా ద్వారా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వచ్చే ఆరోపణలపై సీబీఐతో కాదు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో కూడా విచారణకు సిద్దమని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖకకు రాజధాని రావడం ఇష్టం లేకనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాక్షి, ఎన్టీవీ లాంటి రెండు, మూడు ఛానెల్స్ తప్పితే మిగతా ఛానెల్స్ అన్నీ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సాక్షినే కాకుండా మరో ఛానెల్ ప్రారంభించాలనే యోచనలో జగన్ ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

అందుకే విజయసాయిరెడ్డితో జగన్ ఛానెల్ పెట్టిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆ ఛానెల్ కు అయ్యే ఖర్చుు వైసీపీనే భరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేత ఫండింగ్ తోనే విజయసాయిరెడ్డి కొత్త ఛానెల్ ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఏపీ బేస్ గానే ఈ ఛానెల్ నడవనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఛానెల్ వైసీపీ ప్రోగా ఉంటుందని, ఆ పార్టీకి ప్రజల్లో మైలేజ్ తెచ్చేలా ఉంటుందని చెబుతన్నారు. వైసీపీపై వచ్చే ఆరోపణలు, విమర్శలను ఈ చానెల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి విజయసాయిరెడ్డి కొత్త ఛానెల్ ఏర్పాటు చేసే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -