Vijaya Sai Reddy: నేను ప్రత్యక్షంగా చూశా.. రోడ్లు బాలేవు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేశారే తప్ప అభివృద్ధినీ మాత్రం గాలికి వదిలేసారని చెప్పాలి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ముఖ్యంగా రహదారులు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయి రోడ్లపై వెళ్ళాలంటే కూడా ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము..

ఇలా ఎక్కడ కూడా రోడ్ల నిర్మాణం జరగలేదంటూ ప్రతిపక్షాలు ఇప్పటివరకు విమర్శలు చేశాయి అయితే తాజాగా వైసిపి కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రోడ్లు పరిస్థితి గురించి స్వయంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎంపీ విజయ్ సాయి రెడ్డి గురువారం దుగ్గిరాలలోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజయ్ సాయి రెడ్డి రోడ్ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రోడ్లు రహదారులు సంక్లిష్టంగా ఉన్నాయి.రానున్న 25 రోజులలో వీటిని మరమ్మత్తు చేయిస్తాము అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇక వచ్చే ఎన్నికలలో మంగళగిరి నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయం గురించి మరో వారంలో స్పష్టత ఇవ్వబోతున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థులకు మాత్రమే టికెట్ వస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -