Kesineni Nani: విజయవాడలో టీడీపీకి షాక్.. కేశినేని నాని జంప్?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేరనున్నారా? త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని బిగ్ షాక్ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా టీడీపీలో అసహనంతో ఉన్న ఆయన.. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తన కూతురు శ్వేతతో కలిసి ఆయన కమలం గూటికి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. విజయవాడలో టీడీపీకి బలమైన నేతగా ఆయన ఉన్నారు. బలమైన కమ్మ సామాజికవర్గ నేతగా ఆయనకు విజయవాడలో పేరుంది. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు కేశినేని నాని. ఆ ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే టీడీపీ తరపున ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత ట్విట్టర్ లో అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. తాను సొంత ఇమేజ్ తో గెలిచానని, టీడీపీ, చంద్రబాబుకు ఇమేజ్ ఉంటే జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అప్పటినుంచి టీడీపీకి అంటీముంటనట్లుగానే నాని ఉంటున్నారు. టీడీపీతో గ్యాప్ మెయింటెన్ చేస్తున్నారు.

స్థానిక టీడీపీ నేతలతో కేశినేని నానికి ఎప్పటినుంచో విబేధాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బొండా ఉమ, దేవినేని ఉమాతో కేశినేని నానికి విబేధాలు ఉన్నాయి. దీంతో ఆ నేతలు కేశినేని నానికి సమస్యగా మారారు. చంద్రబాబు కూడా నాని వ్యతిరేక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా కేశినేని నానికి పోటీగా ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని చంద్రబాబు తెరపైకి తెచ్చినట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.

వచ్చే ఎన్నికల్లో కేశినేని చిన్నికి విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకే బోకే ఇచ్చేందుకు నాని నిరాకరించడం, నానిని చంద్రబాబు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారాయి,

ఈ పరిణామాలను బట్టి చూస్తే నాని కాషాయ గూటికి చేరడం ఖాయమని ప్రచారం సాగుతోంది. కార్పొరేటర్ గా ఉన్న కేశినేని శ్వేత కూడా బీజేపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. బీజేపీలో చేరితే నానికి విజయవాడ ఎంపీ టికెట్, కూతురు శ్వేతకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తామని కాషాయదళం హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కేశినేని నాని సమావేశం అయినట్లు ప్రచారం సాగుతోంది. ఆయన బీజేపీలో చేరాలని కోరినట్లు చెబుతున్నారు. గడ్కరీ సూచనతో బీజేపీలో చేరాలని కేశినేని నాని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -