Jagan Stone Attack Case: గులకరాయి కేసులో బెజవాడ పోలీసులు నిండా మునిగారా.. తప్పుడు సాక్షాలు సృష్టించారా?

Jagan Stone Attack Case: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల గులకరాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈయన మేమంతా సిద్ధమని బస్సుయాత్ర ప్రారంభించగా కొందరు తెలియని వారు గులకరాయితో దాడి చేశారు అయితే సతీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు రిమాండ్ రిపోర్టులో ఏ దేనికి పొంతన లేకుండా పోలీసులు తనని రిమాండ్ కి తరలించడంతోనే అక్కడ కుట్ర మొత్తం బయటపడిపోతుంది.

సతీష్ మైనర్ ఆయనకు దాడి చేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు కానీ దుర్గారావు అనే వ్యక్తి తన చేత చేయించారంటే పోలీసులు ఆరోపణలు చేస్తున్నారే కానీ సరైన ఆధారాలతో మాత్రం నిరూపించలేకపోతున్నారు. వీరిద్దరూ ఒకే కాలనీలో ఉన్నప్పటికీ పెద్దగా ఒకరికొకరు పరిచయాలు లేవు అయితే ఈ కేసులో వీరిని ఇరికించి వీరి ద్వారా బలవంతపు సాక్ష్యం చెప్పిస్తూ ప్రముఖ టిడిపి నేతను అరెస్టు చేసే దిశగా వైసిపి కుట్ర ప్లాన్ చేశారు.

ఇప్పటికే డాక్టర్ సర్టిఫికెట్ పేరుతో తప్పుడు బర్త్ సర్టిఫికెట్ ను ప్రధాన నిందితుడి పేరుతో సృష్టించారు. ఇది సాదా సీదా తప్పుడు కేసు కాదు. ఏకంగా రాజకీయ నేతల మీద చేస్తున్న కుట్ర అని చెప్పాలి అయితే రేపు పొద్దున జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం బిఆర్ఎస్ ఓడిపోవడంతో ఫోన్ టాపింగ్ వ్యవహారంతో ఎన్నో విషయాలు అక్రమాలు బయటకు వస్తున్నాయి.

రేపు ఏపీలో కూడా అదే పరిస్థితి ఏర్పడితే వైసీపీ నేతలు అందరూ ఘోరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాలి. తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం మాత్రమే కానీ ఇక్కడ పెద్ద ఎత్తున దోపిడీ అక్రమాలకు తెరలు లేపారు.ప్రధాన నిందితుడిపైన కనీస సాక్ష్యం లేకుండా.. అతన్ని బెదిరించి ఇప్పించిన స్టేట్ మెంట్‌నే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. సరైన సాక్షాలు లేక తప్పుడు స్టేట్మెంట్లతో ఈ గులకరాయి కేసు విషయంలో పోలీసులు నిండా మునిగిపోయారని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -