Viral: బాజా భజంత్రీలు, డీజే చప్పుళ్ల మధ్య పెళ్లి.. కుక్కల రాజభోగం!

Viral: ఈ రోజుల్లో పెళ్లి అంటే మామూలు తంతు కాదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుత క్షణాలు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంటారు. బంధు మిత్రులందరినీ ఆహ్వానించి, పెద్దల సమక్షంలో సంప్రదాయం ప్రకారం బాజా భజంత్రీలతో, ఈ మధ్యన డీజే సౌండ్ ల మధ్య భారీగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలా ఘనంగా ఓ పెళ్లి జరిగింది.

పెళ్లి మామూలుగా జరిగి ఉంటే అది వార్తల్లోకి వచ్చేది కాదు. కానీ అక్కడ జరిగింది కుక్కల పెళ్లి. మీరు చదువుతున్నది నిజమే. ఉత్తర్ ప్రదేశ్ లో ఘనంగా కుక్కల వివాహం జరగగా.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘర్ లో ఈ వావాహ తంతు ఎంతో ఘనంగా జరగగా.. ఇది చూసిన వాళ్లంతా ఆశ్చర్యంతో నోటికి తాళం వేసుకుంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘర్ లో జైలీ అనే ఆడకుక్కకు, టామీ అనే మగకుక్కకు వివాహం జరిగింది. కుక్కల యజమానులు.. మామూలుగా మనుషులకు ఎలాగైతే పెళ్లి చేస్తారో, అలాగే తమకు ఎంతో ఇష్టమైన కుక్కలకు అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇంకేముందు తమకు కావాల్సిన వాళ్లందరికీ పెళ్లి ఆహ్వానం పంపించారు. భారీగా పెళ్లి సెటప్ సిద్ధం చేశారు.

పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం జైలీ మరియు టామీలకు వివాహం చేశారు. పెళ్లికి డీజే కూడా పెట్టి హోరెత్తించగా.. వచ్చిన అతిథులు అంతా ఉత్సాహంగా పెళ్లి తంతులో పాల్గొన్నారు. డీజే పాటలకు వచ్చిన అతిథులు స్టెప్పులు కూడా వేశారు. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న ఈ కుక్కల పెళ్లి వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -