YSRCP: మహిళలకు చీరలు పురుషులకు కూపన్లు.. గెలుపు కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుందా?

YSRCP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎలాంటి పనులు చేయకూడదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన మొదటి రోజే ఈ ఆదేశాలను బేతారు చేయకుండా వైసిపి నాయకులు ఇస్తానుసారంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

విశాఖపట్నం పదో వార్డ్ పరిధిలోని ఎస్ ఐ జి నగర్ రామలింగేశ్వర కళ్యాణ మండపం వద్ద వైకాపా నాయకులు అందరికీ భోజనాలను పెట్టి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. అయితే ఇక్కడ గతంలో మహిళలకు పెద్ద ఎత్తున చీరలను పంపిణీ చేసి తమ పార్టీకి ఓటు వేయాలి అంటూ ఎన్నికల తాయిలాలు ఇచ్చారు.

ఇకపోతే తాజాగా పురుషుల కోసం కూపన్లను ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో భోజనం చేసినటువంటి పురుషులందరికీ కూడా కూపన్ ఇచ్చారు. అయితే ఆ కూపన్ లో వెయ్యి రూపాయల నగదు పెట్టి ఇవ్వటం గమనార్హం. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా గుట్టు చప్పుడుగా వైకాపా నేతలు కూపన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఎన్నికల కోడ్ అమలలోకి వచ్చిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేసేలా ఏ విధమైనటువంటి పనులు చేయకూడదని ఎలక్షన్ కమిషన్స్ స్పష్టంగా ఆదేశాలను జారీ చేసినప్పటికీ మాకు అవన్నీ పట్టవు అన్న దిశగా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారని ఓట్ల కోసం వీళ్ళు ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -