Vishnu Priya: కోరిక తీరుస్తావా అంటూ విష్ణు ప్రియకు చేదు అనుభవాలు!

Vishnu Priya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ విష్ణు ప్రియ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మకు కుర్రాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పోవే పోరా షో తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు అనంతరం సిల్వర్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టింది. ఇక బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మ గురించి తన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన అందంతో ఎంతోమంది బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ అమ్ముడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. మొత్తానికి విష్ణు ప్రియ తన హాట్ అందాలతో సోషల్ మీడియాని ఒక రేంజ్ లో ఊపేస్తుంది. ఇక ఈ అమ్ముడు ఇటీవలే ఒక వీడియో సాంగ్ కూడా చేసింది. జరీ.. జరీ అంటూ సాగే పాటలో తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.

ప్రస్తుతం విష్ణు ప్రియకు సంబంధించిన ఈ సాంగ్ యూట్యూబ్ లో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో సాంగ్ కి వ్యూస్ కూడా మరో స్థాయిలో వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విష్ణు ప్రియ కాస్టింగ్ కౌచ్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను చేసిన వీడియో సాంగ్ ప్రమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ ప్రతిరంగంలోనే ఉందని.. దీని వలన ప్రతి రంగంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిపింది.

ఇక విష్ణుప్రియను కెరీర్ మొదట్లో సినిమాలో ఛాన్స్ ఇస్తా కోరిక తీరుస్తావా అని కొందరు అడిగారని చెప్పుకు వచ్చింది. ఇక వాటికి విష్ణుప్రియ నో చెప్పి ఆ అవకాశాలను వదులుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం విష్ణు ప్రియ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -