VK Naresh: వైరల్ అవుతున్న వీకే నరేష్ సంచలన వ్యాఖ్యలు!

VK Naresh: సినీనటి,దర్శకురాలు విజయనిర్మల కొడుకుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వీకే నరేష్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. జంధ్యాల సినిమాలలో ఎక్కువగా నటించినా నరేష్ కామెడీ హీరోగా అందరినీ మెప్పించాడు. ఇటీవల 50 సంవత్సరాల తన సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్నారు. ఆయన తన ఫ్యామిలీ గురించి ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

ముఖ్యంగా మహేష్ బాబు గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం మంచి కలెక్షన్స్ రాబడుతోంది అది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వొచ్చు కానీ మహేష్ జయాపజయాలకు అతీతం అతను సూపర్ యాక్టర్ అతన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు. సినిమా అన్నాక జయపజయాలు సహజం. మహేష్ వాటన్నింటినీ దాటి వెళ్లిపోయాడని అనుకుంటున్నాను.

నెక్స్ట్ రాజమౌళి తో సినిమా చేస్తున్నాడు అది వరల్డ్ వైడ్ గా పెద్ద సంచలనం అవుతుందని నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చారు నరేష్. అయితే గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. సినిమాలో మహేష్ మాస్ లుక్స్, డైలాగ్స్ డాన్స్ అన్ని ఫాన్స్ చేత విజిల్స్ వేయించాయి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని అత్యధిక కలెక్షన్స్ అందుకున్న రీజనల్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

 

ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం బాడీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టినట్లు సమాచారం అందుకే జర్మనీలోని ప్రముఖ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయిపోయాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు కేటాయిస్తున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -