Mahesh Babu: మహేష్ బాబు గుంటూరు కారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ గుంటూరు కారం థియేటర్స్‌లో సందడి చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు రమణ అనే క్యారెక్టర్‌లో గతంలో ఎప్పుడూ లేనంత మాస్‌గా కనిపిస్తాడు. సూపర్ స్టార్ సినిమాలో ఫైట్స్ అంటే ఎలాగూ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి కానీ.. గుంటూరు కారంలో డ్యాన్సులు కూడా ఇరగదీశాడు. గతకొన్ని సినిమాల నుంచి మహేష్ డ్యాన్సులు చేస్తున్నాడు కానీ.. ఇందులో మాత్రం అంతకు మించి అనిపించాడు. దీనికి తోడు శ్రీలీలా మాస్ స్టెప్పులు థియేటర్‌లో వేయించాయి.

 

ఈ చిత్రంలో శ్రీలీలకు తోడు మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కూడా నటించింది. సినిమాలో మదర్ సెంటిమెంట్ సీన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేశాయి. మహేష్ తల్లిగా రమ్యకృష్ణ క్యారక్టర్ కు ప్రాణం పోశారు. సెంటిమెంట్స్ సీన్లతో పాటు.. క్యారక్టరైజేషన్ సీన్లలో తమన్ మ్యూజిక్ వావ్ అనిపించింది. అలాగే ఈ సినిమాలో జయరాం, జగపతి బాబు, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఈశ్వరి రావు, వెన్నెల కిశోర్ కీ రోల్స్ ప్లే చేశారు.

సినిమా ప్రొడ్యూసర్ ఎస్.రాధాకృష్ణ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ఆయన చెప్పారు. మొదటి రోజు సినిమాపై కాస్తా నెగెటివ్ టాక్ వచ్చినా.. తర్వాత అంతా రివర్స్ అయిపోయింది. సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. బిగ్ స్క్రీన్ పై విడుదలైన 28 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యేలా ప్రొడ్యూసర్స్ నెట్‍ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -