Waltair Veerayya: ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన చిరంజీవి.. అదరగొట్టాడుగా!

Waltair Veerayya: చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. పూనకాలు లోడింగ్ అనేలా ఈ ట్రైలర్ ఉండగా చిరంజీవి, రవితేజ అభిమానులకు ఈ ట్రైలర్ తో గూస్ బంప్స్ గ్యారంటీ అని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్ లో శృతి హాసన్ కొన్ని సెకన్ల పాటే కనిపించినా శృతి హాసన్ అదరగొట్టేశారు. చిరంజీవి, రవితేజ కాంబో సీన్లు ట్రైలర్ కు హైలెట్ గా నిలిచే విధంగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

వాల్తేరు వీరయ్య ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఏ విధంగా చూడాలని కోరుకున్నామో అదే విధంగా బాబీ చూపించారని ఈ నెల 13వ తేదీనా బాక్సాఫీస్ మరోసారి షేక్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. సంక్రాంతి పోటీలో ఎంతమంది ఉన్నా మెగాస్టార్ చిరంజీవికి తిరుగులేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ కు చిరంజీవి పూనకాలు తెప్పించారు. ట్రైలర్ చివర్లో వీరయ్య లోకల్ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. కథ గురించి రివీల్ కాకపోయినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య ట్రైలర్ 170 సెకన్ల నిడివితో రిలీజ్ కాగా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఈ ట్రైలర్ ఉంది.

ఫ్యాన్స్ సైతం చిరంజీవి, రవితేజ కలిసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని చెబుతున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ వీరసింహారెడ్డికి గట్టి పోటీ ఇస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, రవితేజ కలిసి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి మరో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంటారని వాల్తేరు వీరయ్య ట్రైలర్ తో అర్థమవుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -