Shaakuntalam: శాకుంతలం ఫ్లాప్ రిజల్ట్ వెనుక అతని పాత్రే ఎక్కువగా ఉందా?

Shaakuntalam: సమంత ప్రధాన పాత్రలో, గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేదనే టాక్ వినిపిస్తోంది. అభిజ్ఞాన‌శాకుంతం అనే పౌరాణికనాట‌కం ఆధారంగా సినిమాను గుణశేఖర్ తెరకెక్కించాడు. కానీ సినీ ప్రేక్షకుల నుంచి సినిమా అంతగా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకోలేకపోయింది. ఎక్కడా కూడా ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు.

విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలని గుణశేఖర్ భావించాడు. అయినా ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించగా.. స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. అల్లు అర్హ తన నటనతో ప్రేక్షకులను అలరించిందని చెప్పవచ్చు. బాల నటిగా తొలి సినిమాతోనే అల్లు అర్హ మంచి పేరు తెచ్చుకుంది.

భారీ అంచనాలతో ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ఆ అంచనాలకు తగ్గట్లు సక్సెస్ అవ్వలేకపోయిందని చెప్పవచ్చు. విడుదలకు ముందు సినిమాకు మంచి హైప్ వచ్చింది. కానీ ప్రేక్షకులు ఆశించినంతగా సినిమా ఆకట్టుకోలేదు. దీంతో సినిమా ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది. ఈ కథకు సమంతను ఎంచుకోవడం కూడా నెగిటివ్ పాయింట్ గా మారిందని అభిప్రాయపడుతున్నారు. సమంతలో క్యూట్‌నెస్ ఉంటుందని, ఇలాంటి పాత్రలు పోషించే స్టామినా ఆమెకు లేదన అంటున్నారు.

ఇక వీఎఫ్‌ఎక్స్ కోసం ఇంకాస్త టైం తీసుకుంటే బాగుండేదని దిల్ రాజు చెబుతున్నారు. వీఎఫ్‌ఎక్స్ బాగా నాసిరకంగా ఉందని, యాక్షన్ సీన్స్ కూడా పేలవంగా ఉన్నాయి. ఏదో టీవీ యాడ్ చూస్తున్నట్లు యుద్ద సన్నివేశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. శేఖర్ వి జోసెఫ్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -