Bhagavanth Kesari Movie: అక్షరాలా 2 మిలియన్ టిక్కెట్లు.. బాలయ్య రికార్డ్ కు చెక్ పెట్టడం సీనియర్ హీరోలకు కష్టమేనా?

Bhagavanth Kesari Movie: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు బాలయ్య బాబు. ఇకపోతే బాలయ్య బాబు తాజాగా నటించిన భగవంత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కనెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. అయితే మొదటి వీకెండ్ లో లియో మూవీ కారణంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ విషయంలో కాస్త తడబడిన, ఆ తర్వాత పండగ సెలవుల్లో మాత్రం అన్నీ చిత్రాల మీద భారీ లీడ్ ని తీసుకుంది.

మొదటి వీకెండ్ వసూళ్లను చూసి కచ్చితంగా కనీసం 15 కోట్ల రూపాయిలు బయ్యర్స్ నష్టపోతారేమో అని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి దసరా పండగ సెలవులు కలిసి వచ్చాయి. మొదటి ఆరు రోజుల్లోనే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ మార్కుని సాధించి బయ్యర్స్ లో ఉన్న అపోహలను తొలగించింది. ఇక ఈ ఒక్క వీకెండ్ బాగా ఆడితే కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేస్తుంది. ఇకపోతే బుక్ మై షో పేటీఏం లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు రెండు మిలియన్ల టిక్కెట్లు అమ్ముడైపోయాయట. ఇటీవల కాలంలో టాలీవుడ్ చిత్రానికి ఈ రేంజ్ లో టిక్కెట్లు అమ్ముడుపోవడం ఈ చిత్రానికే దక్కింది. బాలయ్య బాబుతో ఇంతటి ఎమోషనల్ సినిమా తీసి సక్సెస్ అయ్యాడంటే అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభకి మెచ్చుకోవాల్సిందే.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు లెక్కల ప్రకారం ఈ సినిమాకి లాంగ్ రన్ ఇప్పట్లో ఆగదని, కచ్చితంగా మరో రెండు మూడు వారాలు లాంగ్ రన్ ఉంటుందని అంటున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ రోజు రోజుకి ఈ సినిమాకి పెరుగుతూ పోతున్నారట. ఫుల్ రన్ లో కచ్చితంగా 75 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -