Dil Raju: దిల్ రాజుకు ఇంతకు మించి అవమానం ఉండదుగా.. ఇప్పటికైనా మారతారా?

Dil Raju: తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా వస్తుంది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా నటించిన ఈ సినిమా మరొక ఐదు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం, సైంధవ, నా సామిరంగా సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ఎంతో నమ్మకంతో హనుమాన్ సినిమా ఈ పోటీలో నిలబడుతుంది. అయితే ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 

సినిమా గురించి హీరో తేజ గురించి మాట్లాడుతూ సినిమాకి ఉన్న థియేటర్ల కొరత గురించి కూడా మాట్లాడుతూ ఆ సినిమా టీం కి ధైర్యం నింపేలాగా మాట్లాడారు చిరంజీవి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఎప్పుడైనా తప్పకుండా చూస్తారని, ఈ విషయంలో ఎలాంటి డౌట్ లు వద్దని మెగాస్టార్ చెప్పకొచ్చారు. హనుమాన్ సినిమా విజయం సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఎన్ని సినిమాలు వచ్చినా సరే మన కంటెంట్ లో సత్తా ఉండి మనకు దైవం ఆశీస్సులు ఉన్నట్లయితే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు.

పెద్ద విజయాన్ని మీకు అందేలాగా చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇది మీకు పరీక్షకాలం అనుకోవచ్చు థియేటర్ లు మనకు అనుకున్న విధంగా లభించకపోవచ్చు అయితే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కంటెంట్ బాగుంటే ఎన్నో రోజు అయినా సరే ఈ సినిమాని చూస్తారు అని చెప్పుకొచ్చారు చిరంజీవి అలాగే దిల్ రాజు గురించి కూడా మాట్లాడుతూ దిల్ రాజు ఎంతో సీనియర్, అనుభవజ్ఞుడు.

 

ఏ సినిమా ఏ సీజన్లో ఎలా ఆడుతుందో ఏ సినిమాకు ఎంత రన్ ఉంటుందని విషయాలు అతనికి బాగా తెలుసు అంటూ దిల్ రాజు గురించి చెప్పుకొచ్చాడు. సంక్రాంతి రిలీజ్ సందర్భంగా దిల్ రాజు పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి మాటల్లో ఉన్న అంతరార్థం ఏమిటన్నది మాత్రం అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అయింది. ఆ మాటలను అర్థం చేసుకున్న పలువురు దిల్ రాజుకి అంతకు మించిన అవమానం ఉంటుందా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -