Samantha Decision: సినిమాల విషయంలో సమంత షాకింగ్ నిర్ణయానికి కారణమిదేనా?

Samantha Decision: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనితోపాటు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమా మరొక వారం రోజులలో షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది. అలాగే సిటాడిల్ వెబ్ సిరీస్ కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది.ఈ రెండు సినిమాలు తప్ప సమంత మరే ఇతర సినిమాలకు కామెంట్ అవ్వలేదని తెలుస్తుంది. అంతేకాకుండా ఈమె కమిట్ అయిన సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి వెనక్కి ఇస్తున్నారని సమాచారం. ఈ విధంగా సమంత అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇవ్వడానికి కారణం లేకపోలేదు.

 

సమంత ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే తాను తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి వెనక్కి ఇస్తున్నారని తెలుస్తుంది. ఇలా ఉన్నపలంగా సమంత ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. గత కొన్ని నెలల క్రితం సమంత మయూసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి ఈమె తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

 

తాజా సమాచారం ప్రకారం ఈ వ్యాధి మరోసారి సమంతకు తిరగబడిందని అందుకే ఈమె తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా పూర్తిగా తన దృష్టి మొత్తం ఆరోగ్యం పై ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈమె సినిమాలకు కొంతకాలం పాటు విరామం ప్రకటించే సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారని తెలుస్తుంది.గతంలో సమంత ఆరోగ్యం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే అలాంటి వార్తలకు తావివ్వకుండా సమంత తన వ్యాధి గురించి చెప్పారు. ఈ క్రమంలోనే మరోసారి కూడా ఈమె తన ఆరోగ్యం పై క్లారిటీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -