Bichagadu 2: వామ్మో.. బిచ్చగాడు2 తొలిరోజు కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉన్నాయా?

Bichagadu 2: హీరో విజయ్ ఆంటోని తాజాగా నటించిన తాజా బిచ్చగాడు 2. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు విజయ్ ఆంటోని దర్శకత్వం వహించారు. కాగా 2016 విడుదల అయినా బిచ్చగాడు సినిమాకి సీక్వేల్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబందించి ప్రమోషన్స్ ని కూడా పెద్దగా చేయలేదు. కానీ ఈ సినిమా విడుదల అయినా తరువాత మొదటి రోజే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

అంతే కాకుండా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా తొలి రోజు నైజాంలో 65 లక్షలకు కాస్త అటు ఇటుగా, ఉత్తరాంధ్రలో 36 లక్షలు తొలి రోజే వసూలు చేసింది. కృష్ణా జిల్లాకు తొలి రోజు 19 లక్షల షేర్ వచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ రేంజ్ తొలి రోజు వసూళ్లను సాధించలేదు. కాగా 2016 లో విడుదల అయినా బిచ్చగాడు సినిమా ఇప్పటికి అభిమానుల మనసులలో మెదులుతూనే ఉంది. అయితే నిజానికి బిచ్చగాడు 2 సినిమాకు సరైన టాక్ రాలేదు.

 

బిచ్చగాడు వన్ కు వచ్చిన టాక్ వచ్చి వుంటే లెక్కలు కట్టడం అంత సులువు అయ్యేది కూడా కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే నైజాంలోనే నాలుగు కోట్లకు పైగా చేసేలా వుంది. ఈ లెక్కన బిచ్చగాడు 3 ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇకపోతే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్ లకు బారులు కడుతున్నారు. పోను పోను ఈ సినిమా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ని సాధించనుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -