Honey Rose: వామ్మో.. హనీరోజ్ ఏకంగా ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తోందా?

Honey Rose: హనీ రోజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఈమె మలయాళ నటి అయినప్పటికీ తెలుగులో ఇదివరకు రెండు మూడు సినిమాలలో నటించారు. అయితే అప్పట్లో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి.ఇలా తెలుగులో గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా మలయాళ ఇండస్ట్రీకి పరిమితమై అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు.

ఈ విధంగా మలయాళ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంత చేసుకున్నటువంటి హనీ రోజ్ పై డైరెక్టర్ గోపీచంద్ మలినేని దృష్టి పడింది. ఈ క్రమంలోనే ఆమెను బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కోసం సంప్రదించారు. ఈ సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలకృష్ణకు భార్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో హనీ రోజ్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 

ఇలా వీరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు. అలాగే వరుస సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇలా ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హనీ రోజ్ ప్రస్తుతం సినిమాలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు రెస్టారెంట్ ప్రారంభోత్సవాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 

ఇలా ఈమెకు తెలుగులో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమె ఏదైనా ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్న లేదా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎంత మొత్తంలో తీసుకుంటుందనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం హనీ రోజ్ ఏదైనా బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నా లేదా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన సుమారు 8 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఎనిమిది లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -