Agent: వామ్మో.. ఏజెంట్ నిర్మాత ఏకంగా ఆ రేంజ్ లో నష్టపోయారా?

Agent: ఏజెంట్ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. విషయం ఏంటంటే పాపం ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలలో చాలా మటుకు ఆయన చేతులు కాల్చేశాయి. ఈయన సినిమాల మీద కనీసంలో కనీసం 100 కోట్లను నష్టపోయి ఉంటారని సినీ వర్గీయుల సమాచారం.

టాలీవుడ్ లో ఈయన మీద అందరూ జాలి పడుతున్నారు, అనిల్ గారి కోసమైనా ఏజెంట్ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు టాలీవుడ్ పరిశ్రమలో ఉన్నవాళ్లు. అయితే ఇది కూడా పెద్ద డిజాస్టర్ గానే మిగిలి ప్రొడ్యూసర్ కి బాగా నష్టాన్ని మిగిల్చింది. ఈయన ప్రొడ్యూసర్ గా కన్నా ముందు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.

ఇది భారతీయ చలనచిత్రాల నిర్మాణం మరియు పంపిణీని లక్ష్యంగా చేసుకున్న ఒక ప్రైవేట్ సంస్థ. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట ఈ కంపెనీలో పార్ట్నర్స్. వీళ్ళందరూ ఎన్నారైలు కావటం గమనార్హం. ఈ బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ సినిమా వెంకటేష్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన నమో వెంకటేశ పెద్దగా కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. వాళ్ల బ్యానర్లో వచ్చిన ఒకటి రెండు సినిమాలు తప్పించి మిగిలిన ఏ సినిమాలు ఆయనకి రాబడిని తీసుకురాలేకపోయాయి.

సినీ వ్యాపారంతో పాటు ఆయన విదేశాల్లోనూ, భారతదేశంలోనూ కూడా వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్క సినిమాలలో తప్పిస్తే మిగిలిన రంగాలలో ఆయన విజేతగా దూసుకుపోతున్నారు. ఆ వ్యాపారాలలో డబ్బు కూడా తీసుకొచ్చి సినిమాల మీద పెట్టడం ఆయన బలహీనత.

ఏజెంట్ సినిమా ఎంత డిజార్డర్ అయినప్పటికీ ఆ సినీ దర్శకుడు సురేందర్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకుండా వెనకేసుకొస్తున్నారు అనిల్ సుంకర. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న సామెతని ఆదర్శంగా తీసుకున్నారు ఏమో గాని ఏమాత్రం వెనకడుగు వేయకుండా మరో సినిమా నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు అనిల్ సుంకర.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -