Anil Sunkara: చిరంజీవి రియల్ క్యారెక్టర్ బయటపెట్టిన నిర్మాత అనిల్ సుంకర.. ఏం చెప్పారంటే?

Anil Sunkara: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో నిర్మాత అనిల్ సుంకర భారీగా నష్టపోయారు. దీంతో భోళా శంకర్ సినిమా తర్వాత నిర్మాత అనిల్ సుంకర పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అనీల్ సుంకర వాట్సాప్ పేరుతో కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనీల్ సుంకర చెప్పినట్టు, ఆ స్క్రీన్ షాట్స్ లో కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి.

వీటిలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే త్వరలోనే చిరంజీవితో అనీల్ సుంకర మరో సినిమా తీయబోతున్నాడట. చిరు నటించిన భోళాశంకర్ డిజాస్టర్ అయింది. దాంతో అనీల్ సుంకర చాలా నష్టాలు చవిచూస్తున్నాడు. ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్ విషయంపై చిరు, అనీల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందంటూ కొత్త ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఈ మేటర్ ను సెటిల్ చేసేందుకు అనీల్ సుంకర, అమెరికా వెళ్తున్నాడని, అక్కడ కొన్ని ఆస్తులు అమ్మి, రెమ్యూనరేషన్ క్లియర్ చేయబోతున్నాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి సమాధానం ఇచ్చినట్టుగా అనీల్ సుంకర పేరిట కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

ఒక అభిమాని, వైరల్ అవుతున్న న్యూస్ ను అనీల్ సుంకరకు వాట్సాప్ చేయగా.. వాటిపై అనీల్ స్పందించాడు. రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ వస్తున్న కథనాల్ని అనీల్ సుంకర ఖండించారు.. అలాంటి కథనాల్ని పట్టించుకోవద్దంటూ ఆయన తన వాట్సాప్ చాట్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసాడు. చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని, త్వరలోనే ఆయనతో మరో సినిమా తీయబోతున్నానని, ఆ సినిమాతో అందరికీ సమాధానం చెబుతానంటూ అనీల్ సుంకర చెప్పినట్టుగా ఒక వాట్సాప్ స్క్రీన్ షాట్ చక్కర్లు కొడుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -