Payal: వామ్మో.. శైలజ పాత్రలో పాయల్ లుక్ మామూలుగా లేదుగా!

Payal: డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి పాయల్ రాజ్ పుత్.ఇలా మొదటి సినిమాతోనే అందాల ఆరబోతతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ తదుపరి పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందలేదని చెప్పాలి.ఇలా మొదటి సినిమాతో హై రేంజ్ లో అందాల ప్రదర్శన కనబరిచిన పాయల్ తదుపరి సినిమాల విషయంలో కూడా అదే స్థాయిలో గ్లామర్ షో చేస్తూ నటించారు.

ఇలా పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమె తాజాగా మంగళవారం అనే సినిమా ద్వారా ప్రేక్షులముందుకు రాబోతుంది.తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఎక్స్ 100 హిట్ తరువాత మంగళవారం సినిమా ద్వారా రాబోతున్నారు.

 

ఇక ఈ సినిమా ద్వారా వీరిద్దరూ హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సినిమా నుంచి తాజాగా పాయాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ తోనే పాయల్-అజయ్ షాకిచ్చారు అని చెప్పొచ్చు. ఇందులో పాయల్ చాలా బోల్డ్ లుక్ లో ఉన్నారు. ఒంటి పై నూలు పోగు కూడా లేకుండా చాలా బోల్డ్ గా ఉన్నారు. పోస్టర్ లో పాయల్ వీపు కనిపించేలా నగ్నంగా వెనక్కి తిరిగి ఉండగా, ఆమె వేలిపై సీతాకోకచిలుక వాలి ఉంది.

 

ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మొత్తానికి ఈ సినిమా ద్వారా అజయ్ భూపతి మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -