Allari Naresh: వామ్మో.. అల్లరి నరేష్ సిగరెట్లు తాగడం వెనుక అసలు కారణాలివా?

Allari Naresh: తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్, హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా, హీరోగా నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు నరేష్. ఇప్పటివరకు నరేష్ తెలుగులో దాదాపుగా 59 సినిమాలలో నటించి మెప్పించాడు. కాగా కెరిర్ మొదట్లో వరుసగా సినిమాలలో నటించిన అల్లరి నరేష్ ఆ తర్వాత రాను రాను సినిమాలో నటించడం తగ్గించేశారు. ఈ మధ్యకాలంలో నరేష్ నటించిన సినిమాలు కూడా అంతేగా సక్సెస్ కావడం లేదు.

ఇక చివరగా అల్లరి నరేష్ నాంది సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే నరేష్ తాజాగా నటించిన చిత్రం ఉగ్రం. కాగా అల్లరి నరేష్ నటించిన 60 వ సినిమా ఇదే. ఈ సినిమాలు మీర్నా మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇది ఇలా ఉంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

ఈ సందర్బంగా అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ.. అడవిలో ఒక ఫైట్‌ సీన్‌లో స్మోక్‌ మిషన్లు పెట్టారు. ఒకవైపు దట్టంగా పొగ వచ్చేలా మిషన్లు పెట్టారు. మరోవైపు నన్ను సిగరెట్‌ తాగుతూ రమ్మంటారు. దాదాపు నాలుగు రోజుల్లో ఐదారువందలు సిగరెట్లు తాగాను. దీంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతింది అని చెప్పుకొచ్చారు నరేష్. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో నరేష్ తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. ఇదివరకు కేవలం కామెడీ సినిమాలలో నటించిన నరేష్ ప్రస్తుతం అన్ని సీరియస్ సినిమాలలో నటిస్తున్నాడు. నాంది సినిమాలో సీరియస్ పాత్రలో నటించి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న నరేష్ ఉగ్రం సినిమాతో ఏ మేరకు సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి మరి. ఇందులో నరేష్ పోలీస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.. ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -