Balagam Beauty: ఆడియన్స్ కు షాకిస్తున్న బలగం బ్యూటీ కామెంట్లు.. ఏమన్నారంటే?

Balagam Beauty: కావ్య కళ్యాణ్ రామ్ గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. చిన్నప్పుడు పలు సినిమాలలో బాలనటిగా నటించిన ఈమె ప్రస్తుతం హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈమె నటించిన మసూద, బలగం సినిమాలు ఎంతగా సక్సెస్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇలా ఈ రెండు సినిమాలతో నటిగా మంచి గుర్తింపు పొందిన ఈమె త్వరలోనే ఉస్తాద్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహం హీరోగా రాబోతున్న మూవీ ఇది. ‘వారాహి’ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ద్వారా మరోసారి ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ కావాలంటే కొన్నిసార్లు మనం పెట్టుకున్న లిమిట్స్ కూడా క్రాస్ చేయాల్సి ఉంటుంది.

 

ఈ క్రమంలోనే కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ లిప్ లాక్ సన్నివేశాలు బెడ్ రూమ్ సీన్స్ నటించడానికి కూడా సిద్ధమని తెలిపారు. నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల సన్నివేశాలలోనూ నటించాల్సి ఉంటుందని తెలిపారు.. అయితే ఈ బోల్డ్ సీన్స్ లో నటించాలి అంటే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈమె చేసిన ఈ కామెంట్లపై స్పందించిన పలువురు ఈమె కమర్షియల్ గా సక్సెస్ కావాలని అనుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -