Samantha: ఆ విగ్రహంపై ఫైర్ అవుతున్న సమంత అభిమానులు.. ఏం బాగుందంటూ?

Samantha: బాపట్లకు చెందిన సందీప్ అనే ఒక అభిమాని సమంతపై ఉన్నటువంటి అభిమానంతో ఏకంగా తన ఇంటి ఆవరణంలో సుమారు ఆరు లక్షల వరకు ఖర్చు చేసి తనకు గుడి నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.గత మూడు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది అయితే ఈయన సమంత చేస్తున్నటువంటి సహాయ సహకారాలతో తనకు అభిమానిగా మారి గుడి నిర్మించానని తెలిపారు.

ఇక సమంత ఏప్రిల్ 28వ తేదీ పుట్టిన రోజున జరుపుకోవడంతో తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు.ఈ ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ సమంత పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులకు విందు భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా కేక్ కట్ చేసి ఈ గుడిని ప్రారంభించారు.

 

ఇలా సమంత పై అభిమానంతో ఈయన గుడి నిర్మించగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు వైరల్ కావడంతో పలువురు నెటిజెన్స్ ఈ ఫోటోలపై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.గుడి అయితే కట్టారు కానీ సమంత కోసం గుడి కడుతున్నామని చెప్పి సమంత విగ్రహం కాకుండా అక్కడ లక్ష్మి పార్వతి విగ్రహం పెట్టారేంటి అంటూ సమంత విగ్రహం పై భారీగా ట్రోల్ చేస్తున్నారు.

 

ఆలయంలో ప్రతిష్టించిన సమంత విగ్రహం పూర్తిగా సమంత రూపు రేకులకు భిన్నంగా ఉండడంతో పలువురు సమంత అభిమానులు ఈ విగ్రహం ఏర్పాటు పై మండిపడుతున్నారు. అక్కడ ఉన్నది సమంత అని మీరు చెప్పే వరకు మాకు తెలియడం లేదు అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఏంటి బ్రో ఈ విగ్రహానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిందేనా అంటూ మరికొందరు ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతో అందంగా ఉండే సమంత విగ్రహాన్ని ఇలా అందవిహీనంగా తయారుచేసి ప్రతిష్టించడంతో అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -