Pawan Akira: పవన్ కు అకీరాకు మధ్య విబేధాలా.. అసలేం జరిగిందంటే?

Pawan Akira: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో వచ్చే నెల‌లో బ్రో రిలీజ్ కానుంది. అలాగే ఈ ఏడాది చివ‌ర్లో ఓజీ సినిమా కూడా విడుదల కానుంది. ఆ తరువాత మిగిలిన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలు విడుదల కానున్నాయి.

అయితే ఇందులో కొన్ని సినిమాలకు సంబంధించి ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం పవన్ బిజీగా ఉండటం వల్ల షూటింగే కాస్త బ్రేక్ పడింది. అధికారంలోకి రాకపోయినా కూడా పవన్ ఎంతో మంది పేదలకు ప్రజలకు రైతులకు సహాయం చేసిన విషయం తెలిసిందే. అలాగే ప‌వ‌న్ కెరీర్ ఆర్థిక సంబంధాల‌కు అంత విలువ ఉండ‌దు. అందుకే ఆరెంజ్ సినిమా సమయంలో త‌న ఆస్తులు అమ్మీ అన్న నాగ‌బాబు అప్పులు తీర్చాడ‌ని, ఆ కార‌ణంతోనే రేణు దేశాయ్ ప‌వ‌న్‌కు దూర‌మైంద‌ని అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

 

ప‌వ‌న్‌కు విడాకులు ఇచ్చేశాక రేణు త‌న కొడుకు అకీరా, కూతురుతో క‌లిసి పూణేలోనే ఉంటోంది. ఇదిలా ఉంటే ప‌వ‌న్‌కు త‌న కొడుకు అకీరాకు కూడా గ్యాప్ వచ్చిందని, ఏడాది నుంచి అకీరా, ప‌వ‌న్‌ను క‌లిసేందుకు కూడా పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని అందుకే ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రు క‌లిసిన ఫొటోలు, సంద‌ర్భాలు కూడా లేవ‌నే అంటున్నారు.

ప‌వ‌న్ పార్టీ కార్య‌క‌లాపాల కోసం అకీరా పేరున పెట్టిన ఆస్తుల‌ను కూడా తిరిగి వాడుకున్నాడ‌ని ఇదే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మైంద‌న్న వార్తలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. రాజ‌కీయం చేయాలంటే చాలా డ‌బ్బులు కావాలి. ఈ క్ర‌మంలోనే రేణుతో పాటు వాళ్ల పిల్ల‌ల పేర్ల రాసిన ఆస్తుల‌ను కూడా వాడేయ‌డం అకీరాకు న‌చ్చ‌లేదని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -