Balayya: బాలయ్య అల్లుడికి దిమ్మతిరిగే షాక్.. ఏం జరిగిందంటే?

Balayya: రాజకీయాల్లోకి రావాలన్నా, ఇక్కడ నిలబడాలన్నా ఎంతో కొంత బ్యాగ్రౌండ్ ఉండాల్సిందే. చాలా అంటే చాలా తక్కువ మందే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తుంటారు. అందులో ఎదిగిన వారు చాలా తక్కువ. కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు కొందరికీ రాజకీయాలు కలిసిరావు. ఇలాంటి పరిస్థితే సినీ నటుడు బాలయ్య చిన్నల్లుడు గీతం విద్యా సంస్ధళ చైర్మన్‌ శ్రీ భరత్‌కి ఏర్పడింది.

భరత్ కి రాజకీయంగా మాంచి బ్యాగ్రౌండ్ ఉంది. ఆర్థికంగా అంటే చెప్పనవసం లేదు. ఫుల్ రిచ్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ తన విద్యా సంస్థలను నెలకొల్పాడు. కానీ ఆయనకు 2019లో మొదటి ప్రయత్నంలోనే టీడీపీ టిక్కెట్‌ లభించడం కష్టం అయిపోయింది. తీరా టిక్కెట్‌ తెచ్చుకున్నా త్రిముఖ పోటీలో ఓటమి తప్పలేదు.

ఈ క్రమంలోనే భరత్ బాగా సైలెంట్ అయ్యారు. ఏదో పిల్లలకు చదువు చెప్పుకోవటం, కళాశాలలను నడుపుకోటం చాలు కదా ఈ రాజకీయ రొచ్చు ఎందుకుని ప్రశ్నించుకున్నట్లు ఉన్నారు. అందుకే ఎన్నికల రిజల్ట్ తర్వాతా చాలా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు.

గత ఏడాదిగా మళ్లీ ఆయన చురుకుగా కనిపిస్తున్నారు. ఆరు నూరు అయినా 2024 ఎన్నికలలో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని శ్రీ భరత్‌ పట్టుబడుతున్నారు. అయితే శ్రీ భరత్‌కు ఆశ ఉన్నా దాని కంటే ఎక్కువగా ఆటంకాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం అధినాయకత్వం ఆయనకు ఎంపీ టిక్కెట్‌ ఇస్తుందా అన్నది ఓ సందేహంగా ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు ఈ టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఒకవేళ బీజేపీ కూడా పొత్తులో చేరితే ఆ పార్టీకి ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -