Jagan-Balayya: దౌర్భాగ్యుడు అంటూ బాలయ్యపై కామెంట్లు చేసిన జగన్.. ఏమైందంటే?

Jagan-Balayya: సీఎం జగన్ కి ఏమైంది.. ఆయన నందమూరి బాలకృష్ణ కి హార్ట్ కోర్ ఫ్యాన్ అని అంటారు. అలాగే ఆయన రాజకీయాల్లోకి రాకముందు బాలయ్య అభిమాన సంఘం ప్రతినిధిగా కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాంటి బాలయ్యకి షాకిచ్చే కామెంట్లు చేశాడు జగన్. ఇంతకీ ఏం జరిగిందంటే తిరుపతి జిల్లా ధర్మవరంలో నేతన్న హస్తం పథకానికి సంబంధించిన సీఎం జగన్ బటన్ నొక్కారు.

అనంతరం మాట్లాడుతూ ఆయన వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. ఒక్క పవన్ నే కాకుండా లోకేష్ బాలకృష్ణ ఎలా పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దన్న పెట్టాలి కడుపున చేయాలి అంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు.

 

నువ్వు సినిమాలోనే చేశావు నేను నిజ జీవితంలోనే చేశాను అంటూ వెదవ పనులను ఇంకొక ముసలాయన చెప్పుకుంటాడు అలాంటి సంస్కారహీనులు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు పవన్ లోకేష్ చంద్రబాబుపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు సీఎం జగన్. అయితే జగన్ ఎప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు ని విమర్శించాడు తప్పితే పవన్ తో పాటు ఎల్లో మీడియాను సైతం పరోక్షంగానే విమర్శించేవారు జగన్.

 

లోకేష్, బాలకృష్ణ లను అయితే పెద్దగా లెక్కలోకి కూడా తీసుకునేవారు కాదు కానీ ఎందుకో సడన్గా రూట్ మార్చాడు సీఎం జగన్. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా వాలంటీర్ల వ్యవస్థను తప్పుపడుతున్న ప్యాకేజి స్టార్ చంద్రబాబు కి పదేళ్లుగా వాలంటీర్ గా సేవలందిస్తున్నారు అంటూ సెటైర్లు వేశాడు. అంతా ఓకే గాని మధ్యలో బాలయ్య ఏం చేశాడని జగన్ ఆయన మీద విరుచుకుపడుతున్నారు అని తలలు పట్టుకుంటున్నారు రాజకీయ వర్గం వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -