Nikhil: నిఖిల్ నిజస్వరూపం ఇదే.. ఇంత దారుణంగా వ్యవహరించారా?

Nikhil: టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో ఫుల్ జోష్ ని పెంచేసిన నిఖిల్ ఆచితూచి వ్యవహరిస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నాడు.. ఇటీవల కాలంలో నిఖిల్ నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు నిఖిల్ మామూలు హీరో కాదు పాన్ ఇండియా హీరో. ఇక నిఖిల్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా స్పై. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాని ఈనెల ఆఖరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ హీరో నిర్మాత మధ్య ఆ విషయంలో కాస్త సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. నిఖిల్ ఈనెల ఆఖరికి వద్దని ప్రమోషన్స్ కు సమయం సరిపోదు కాబట్టి రిలీజ్ డేట్ ని పోస్ట్ ఫోన్ చేద్దామని అంటున్నాడట. అటు నిర్మాత ఈక్వేషన్స్ మరోలా ఉన్నాయి. ఈ సినిమాను ఇంతకుముందే ప్రకటించిన తేదీకి కచ్చితంగా విడుదల చేయాలి. ఈ సినిమాను భారీ మొత్తానికి దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు విడుదల వాయిదా పడితే అమెజాన్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది.


అందుకే విడుదల తేదీని వాయిదా వేయడానికి నిర్మాత ఇష్టపడడం లేదు జూన్ 29న థియేటర్లలోకి వస్తున్నామంటూ అందులో మరోసారి ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారానికి నిఖిల్ దూరంగా ఉన్నాడు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఇలా ఆఖరి నిమిషంలో నిర్మాతలకు తలనొప్పులు తెచ్చిపెడతాడనే టాక్ నిఖిల్ పై ఎప్పట్నుంచో ఉంది. నిర్మాతల గురించి, సినిమా బిజినెస్ గురించి ఆలోచించకుండా తన సొంత ప్రయోజనాలకు నిఖిల్ ప్రాధాన్యం ఇస్తాడంటూ గతంలో కూడా కథనాలొచ్చాయి. టీజర్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ తో చాలామంది సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నిఖిల్ వ్యవహారశైలితో రిలీజ్ కు ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయనేది నిర్మాత వాదన. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ లవడంతో నిఖిల్ కి అంత బలుపా అని కొందరు కామెంట్స్ చేయగా, ఇంకొందరు అవకాశం ఇచ్చినోడినే నిఖిల్ మోసం చేయాలని చూస్తున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -