Rajamouli: ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిన జక్కన్న.. ఏమైందంటే?

Rajamouli: విశ్వవ్యాప్తంగా ఇప్పుడు తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది తెలుగు వారిగా ప్రతి ఒక్కరు గర్వించాలి. గల్లి నుంచి ప్రపంచ దేశాలలో ఉండే ప్రధాన నగరాలలో కూడా ఆర్ఆర్ఆర్ పేరు ఓ రేంజ్‌లో వినిపిస్తోంది. దీనంతటికీ కారణం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. ఇద్దరు బడా హీరోలతో మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఈ మూవీని ప్రపంచ దేశాలు గర్వించే రీతిలో తెరకెక్కించి ఇప్పుడు మన తెలుగు సినిమాని ఆస్కార్‌కి సైతం నామినేట్ అయ్యేలా చేశాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పాలు అవార్డ్స్‌తో సంచలన రికార్డులు అందుకుంది. అయితే తాజాగా మరో క్రేజీ అవార్డ్స్ కూడా అందుకుని భారత్‌ సినిమా సత్తాను చూపించారు.

 

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఇప్పుడు అమెరికాలోని ప్రతిష్టాత్మకంగా ఇచ్చే హాలీవుడ్ ఫిలిం అసోసియేషన్ అవార్డ్స్‌లోనూ ఏకంగా నాలుగు కేటగిరీల్లో గెలిచి సంచలనం సృష్టించి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలా ఒకే సినిమాకి నాలుగు కేటగిరీల్లో అవార్డు అందుకున్న ఏకైక సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు నెలకొల్పింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్సీఏ అవార్డులలో బెస్ట్ స్టాండ్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగాలలో గెలుపొంది. ఈ క్రమంలోనే అవార్డు తీసుకున్న రాజమౌళి, రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా అవార్డు తీసుకున్న తరువాత రాజమౌళి స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ తెల్లోలని తన స్పీచ్‌తో దడదడ లాడించాడు. కళ్లు తిప్పకుండా శ్వేతజాతీయులు ఆ స్పీచ్‌ విన్నారు.

 

మా సినిమాను ఆదరించిన అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. షూటిగ్ టైంలో మేము పడిన కష్టమంతా ఇప్పుడు ఈ అవార్డు రూపంలో దక్కింది. ఈ చిత్రంలో స్టంట్స్ చేసేందుకు ఎంతో కష్టపడినా కొరియోగ్రాఫర్స్‌కి ముందుగా చాలా థాంక్స్. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం కష్టపడిన స్టాండ్ మాస్టర్ బుజ్జికి థాంక్స్. ఇది నా విజయం ఒక్కడిదే కాదు. భారతదేశానికి దక్కిన ఈ గౌరవాన్ని నేను ఇండియన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను అని ఎమోషనల్‌గా మాట్లాడారు రాజమౌళి. దీంతో పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ పై కామెంట్లు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -