Ramoji Rao: ఆ ఒక్క ట్వీట్ తో రామోజీ రావు పరువు గోవింద.. ఏం జరిగిందంటే?

Ramoji Rao: గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పేరు మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే టిడిపి కి అలాగే ఈనాడు కి మధ్య ఉన్న అనుబంధం గురించి మనందరికీ తెలిసిందే. మార్గదర్శి ఫైనాన్ష్‌, చిట్‌ఫండ్ ఆర్థిక‌ వ్య‌వ‌హారాల్లో రామోజీరావు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌కు చిక్కిన సంగతి మన అందరికి తెలిసిందే. చివ‌రికి ఏపీ సీఐడీ ద‌ర్యాప్తు అంటే భ‌యంతో రామోజీరావు మంచం పట్టాల్సిన దుస్థితి వచ్చింది. కాగా ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావును దోషిగా నిలబెట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అలుపెరుగని న్యాయ పోరాటం చేస్తున్నారు అరుణ్ కుమార్. అయితే రామోజీరావు నిర్వ‌హిస్తున్న మార్గ‌ద‌ర్శిలో ఎలాంటి ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని టీడీపీ భావిస్తే, ఆ పార్టీ ప్ర‌తినిధితో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ఉండ‌వ‌ల్లి ఇటీవ‌ల స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్‌ను టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి, యువ‌నాయ‌కుడు జీవీరెడ్డి స్వీక‌రించిన సంగతి తెలిసిందే.. ఇకపోతే వచ్చేనెల అనగా మే 14న హైద‌రాబాద్ ప్రెస్‌ క్ల‌బ్‌లో వాళ్లిద్ద‌రి బ‌హిరంగ చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు రామోజీ రావు ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని, ఆయ‌నంత మంచి వ్యక్తి మరొకరు లేరు అన్న విధంగా కొందరు న్యాయ నిపుణులు మేధావులు మాట్లాడుతున్నారు.

 

ఉండ‌వ‌ల్లి దెబ్బ‌కు రామోజీనే కాదు, టీడీపీ కూడా గిల‌గిల‌లాడుతోంద‌ని తాజాగా ఆ పార్టీ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో పెట్టిన పోస్టే నిద‌ర్శ‌నం చెప్పవచ్చు. ఆ పోస్ట్ లో జనానికి కీడు చేస్తున్న పాలన గురించి మాట్లాడట. కనీసం తన స్నేహితుడి హత్య గురించి గానీ, ఆ స్నేహితుడి కూతురిపై చేస్తోన్న ఆరోపణల మీద కానీ స్పందించడట. కేవలం తనకు గిట్టుబాటు అయ్యే అంశాల గురించి మాత్రమే మాట్లాడుతూ, జనాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి వారిని ఏమనాలి అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఉండ‌వ‌ల్లిని వెట‌కారిస్తూ ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. రామోజీరావు చేసింది నేర‌మే, అలాగే వివేకాను హ‌త్య చేయ‌డం అంత‌కంటే పెద్ద నేర‌మ‌ని టీడీపీ సమాజానికి చెప్పకనే చెబుతున్నట్టుగా ఉంది.

 

కానీ టీడీపీ ఆవేద‌నంతా ఏంటంటే మీ నిల‌దీత కేవ‌లం రామోజీ రావు ఆర్థిక నేరాల వ‌ర‌కే ఎందుకు ప‌రిమితం చేస్తారు? వివేకా హ‌త్య కేసు వైపు చూడాల‌ని సూచించిన‌ట్టుగా వుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి..ఉండ‌వ‌ల్లి మాట‌కు ఎంత ప‌వ‌ర్ వుందో టీడీపీ ట్వీట్ చెబుతోంది. ఉండ‌వ‌ల్లి మాట‌లు వింటున్న జ‌నం త‌ప్పుదోవ ప‌డుతున్న‌ట్టు ఆ పార్టీ చెబుతోంది. అంటే రామోజీరావుపై ఉండ‌వ‌ల్లి చెబుతున్న ప్ర‌తిమాట న‌మ్ముతున్నార‌ని టీడీపీ ఒప్పుకుంటోంది. కాగా టిడిపి చేసిన ఆ ట్వీట్ పై స్పందించిన కొందరు టిడిపి చేసిన ఒక్క పోస్టుతో రామోజీరావు పరువు మొత్తం పోయిందిగా, రామోజీరావు పరువు గోవిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -