TDP: టీడీపీ రెబల్ ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే షాక్.. అసలేమైందంటే?

TDP: గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఒక వివాదంలో వంశీ పై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసు విచారణకి వంశీ హాజరు కాలేదు. దాంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే న్యాయస్థానానికి హాజరు కావడం లేదని వంశీకి న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయినప్పటికీ హాజరు కాకపోవటంతో అరెస్టు వారంటూ జారీ చేసింది.

 

వల్లభనేని వంశీ పై నాలుగు కేసులలో విచారణ జరుగుతున్న క్రమంలో కోర్టు ఏకంగా నాలుగు అరెంజ్ వారంట్లను జారీ చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ పై నాలుగు కేసుల్లో విచారణ జరుగుతుండగా విచారణకు ఆయన ఇప్పటివరకు కోర్టుకు హాజరు కావడం కాకపోవటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.అరెస్టు వారెంట్ పై వల్లభనేని వంశీ కౌంటర్ కి దాఖలు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల కోర్టు జారీ చేసింది అరెస్టు వారింట్ మాత్రమే కాబట్టి ఆయన కోర్టు విచారణకు ఎందుకు హాజరు కాలేకపోయారు అనే విషయాలను వివరిస్తూ అఫిడవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయనున్నారని సమాచారం. గత ఎన్నికలలో తెదేపా నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపారు.

 

దీంతో వైసీపీ లో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తెదేపాలో చేరారు. రానున్న ఎన్నికలలో గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ పోటీ చేయనున్నారు. మరొకవైపు వైసీపీ నుంచి వంశీకి టికెట్ రావడం కష్టమని తెలుస్తోంది. సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తెకి సీఎం జగన్ సీటు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వంశీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -