Father Selling Blood: బిడ్డ కొరకు రక్తం అమ్ముతున్న తండ్రి.. ఏమైందంటే?

Father Selling Blood: తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయినా కూతురి కోసం ఒక తండ్రి ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. సహాయం కోసం ఎదురుచూసి తాను కష్టపడి చివరికి విసిగిపోయాడు. దాంతో కూతుర్ని కాపాడుకోలేనేమో అన్న బెంగతో ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. అతని కూతురి పేరు అనుష్క గుప్తా. అమ్మాయి ఐదేళ్ల కిందట ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో వెన్నముకు విరిగే పూర్తిగా మంచానికి పరిమితం అయింది. కూతురి చికిత్స కోసం తండ్రి ప్రమోద్ ఉన్న ఇంటిని దుకాణాన్ని కూడా అమ్మేశాడు.

అప్పులు చేసి మరీ మందులు తెరఫీలు చేయించాడు. అయినప్పటికీ కూతురికి నయం కాలేదు. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వడంతో చిన్నచితక పనులకు వెళ్లినప్పటికీ ఏమాత్రం సరిపోలేదు. ఈలోపు అధికారులు సహాయం చేస్తానని మాట ఇచ్చారు. అదే విషయాన్ని కొందరు నేతలు మైకుల్లో కూడా అనౌన్స్ చేసుకున్నారు. అయితే అధికారులు ఏదో చేస్తారని గవర్నమెంట్ ఏదో చేస్తుంది అని ఏడాది పాటు కాళ్ళలో చెప్పులు అరిగిపోయేలా తిరిగాడు ఆ తండ్రి. ఇంట్లో తినడానికి ఏమీ లేని పరిస్థితుల్లో తరచూ తన రక్తం అమ్ముకునేవాడు. గత ఏడాదిగా గుప్తా ఇంటి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి.

 

దాంతో కూతురి కోసం ఏమీ చేయలేకపోతున్నాను అన్న నిరాశ ఆర్థికంగా కుంగిపోయేలా చేసింది. దాంతో చేసేది ఏమీ లేక ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. కూతురి ఆరోగ్యం విషయంలో అప్పటికే దిగులుగా ఉన్న ప్రమోద్‌ కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం సాత్నా రైల్వే పట్టాలపై ప్రమోద్‌ శవాన్ని గుర్తించారు. కేసు దర్యాప్తు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అనుష్కా గుప్తా.. సరస్వతి పుత్రిక. ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైనా సరే పుస్తకాన్ని వదల్లేదు. కూతురిలోని ఆ ఆసక్తికి చంపడం ఇష్టం లేక ఇంటి నుంచే ఆమె చదువును కొనసాగించేలా ఏర్పాట్లు చేశాడు ప్రమోద్‌. ఒక మనిషి సహాయంతో ఆమె బోర్డు పరీక్షలు రాసింది. బోర్డు ఎగ్జామ్స్‌లో ఆమె సాధించిన ప్రతిభకు విద్యాశాఖ సత్కారం కూడా చేసింది. పై చదువుల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఆ తండ్రి కూతురి ట్రీట్‌మెంట్‌, ఇంటి అవసరాల ఆర్థిక భారాన్ని మోయలేకపోయాడు. బంగారు తల్లి కోసం ఏం చేయలేకపోయానే అనుకుంటూ నిత్యం కుమిలిపోయాడు. పాపం.. ప్రాణం తీసుకునే ధైర్యం ప్రదర్శించిన ఆ తండ్రి బదులు పోరాడి అధికారుల నుంచి రావాల్సిన సాయం రాబట్టుకుని ఉంటే బాగుండేదేమో.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -