Madhya Pradesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్.. నిరుద్యోగులకు మరో భారీ షాక్ తగలనుందా?

Madhya Pradesh:  కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుతో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు రుజువు చేసింది. ఎన్నికలతో పాటు వర్క్ ఫోర్స్‌లో మహిళల పార్టిసిపేషన్ పెరగాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఇదే దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటి నుంచి రాష్ట్రంలో కొత్తగా వచ్చే ప్రతి 100 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ గవర్నమెంట్ జాబ్స్‌లో 35 మహిళలకు రిజర్వ్‌ అవుతాయి. గతంలో రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఈ కొత్త విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనికి సంబంధించి తాజాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం తాజాగా ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ విషయానికి వస్తే.. కొత్త పాలసీ ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని మహిళలు ఇప్పుడు అటవీ శాఖ ఉద్యోగాలు మినహా అన్ని కొత్త ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ పొందుతారు. ఈ సరి కొత్త విధానం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తిస్తుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ స్టేజ్‌లో రిజర్వేషన్స్ అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్వ్యూల ద్వారా చేపట్టే నియామకాల్లో మహిళలు రిజర్వేషన్ పొందవచ్చు. స్త్రీలకి సాధికారత కల్పించడం, వారు స్వయం సమృద్ధిగా మారడంలో సహాయ పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రకటన గమనార్హం. లాడ్లీ బెహనా యోజన అనే కొత్త పథకం కింద ఈ రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం ఇస్తోంది. ఈ స్కీమ్ రాష్ట్రంలోని మధ్యతరగతి మహిళలకు నెలకు రూ.1,000 భృతిని అందిస్తుంది. అన్ని కులాల మహిళలకు అందుబాటులో ఉంది. ఈ పథకానికి రూ.3,628.85 కోట్లు కేటాయించారు. దీని కింద రూ.2.5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న 23-60 ఏళ్ల వయస్సు గల మహిళలు రూ.1,000 నెలవారీ భత్యం పొందవచ్చు. లాడ్లీ బెహనా యోజన పథకం కింద రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళలకు ఈ నెల నుంచి రూ.1,250 నెలవారీ భత్యం అందిస్తామని కూడా సీఎం తెలిపారు. ఈ మొత్తాన్ని క్రమంగా నెలకు రూ.3,000కు పెంచనున్నారు. రాష్ట్రంలో మహిళల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం. పారిశ్రామిక వాడల్లో మహిళలు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా వారికి పట్టా భూములు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మహిళల ఆదాయాన్ని నెలకు కనీసం రూ.10 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -