Heroine: నాన్న గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. ఏమైందంటే?

Heroine: సినీ నటుల జీవితాలు గాలిలో దీపాలు లాంటివి ఎప్పుడూ వెలుగుతాయో ఎప్పుడు ఆరిపోతాయో వాళ్ళకి తెలియదు. పైగా వారి జీవితాలు తెరిచిన పుస్తకాలు. అందరి ఇళ్లల్లో ఉండే సమస్యలే వాళ్ళ పిల్లల్లో కూడా ఉంటాయి కానీ అవే సమస్యలని హైలెట్ చేసి వాళ్లని మరింత బాధపడుతూ ఉంటారు జనాలు. సినీ తారల జీవితాలు ఏమి అద్దాల మేడలు కాదు అని మలయాళ సినీ నటి అర్థనా బిను ని చూస్తే అర్థమవుతుంది. ఈమె సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అనే తెలుగు సినిమాలో కూడా నటించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే ఆమె తన తండ్రి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తనను సినిమాలో నటించవద్దని బెదిరిస్తున్నాడని.. నటుడు, తన తండ్రి అయిన విజయ్ కుమార్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తన మాటలని ఖండిస్తూ నేను దొంగతనంగా గోడ దూకి రాలేదని తన కూతుర్లు అక్కడ ఉన్నారో లేదో చూడటానికి వచ్చానని చెప్పుకొచ్చారు విజయ్ కుమార్. నా కుటుంబం మీద నా తండ్రి చేస్తున్నారో అవాస్తవం. నిజం పూర్తిగా తెలిస్తే అసలు విషయం మీకే అర్థమవుతుంది అంటూ ఇలా చెప్పుకొచ్చింది అర్థనా బిను.

 

గోడ దూకి రాలేదు అని అతను చెప్తున్నాడు కానీ నేను పోస్ట్ చేసిన వీడియోలో అతను గోడ దూకడం మీరు క్లియర్ గా చూడవచ్చు. మా ఇంట్లో నేను అమ్మ చెల్లి నానమ్మ ఉంటాను రేపు ఇతడుని చూసి ఇంకెవరైనా గోడదు మా పరిస్థితి ఏంటి అంటూ తన ఆవేశాన్ని వెళ్లగక్కింది ఈ భామ. మా నాన్న నీచుడు..అమ్మతో విడాకులు ప్రక్రియ పూర్తికాలేదు అని చెప్పిన మాట అవాస్తవం. వాళ్ళిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసిన సాక్ష్యం ఈ పోస్టులో పొందుపరుస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

 

మా చెల్లి చదువు కోసం అమ్మ బ్యాంకులో నాలుగు వేలు డిపాజిట్ చేశాను అని చెప్తున్నాడు కానీ అతను అమ్మకు పది లక్షలు బంగారం బాకీ ఉన్నాడు దీనిపై అమ్మ పెట్టిన కేసు ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రతినెల 5000 మా అమ్మకు ఇవ్వాలని కోర్టు షరతు విధించింది కానీ అది కూడా సరిగ్గా చెల్లించక మాకు బకాయి పడ్డాడు. అలా వాయిదా పడ్డ డబ్బే అతను చెల్లించాడు అంటూ ఇన్స్టాగ్రామ్ లో తన వాదన వినిపించింది ఈ నటి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -