Rahul Gandhi: రాహుల్‌గాంధీ పాదయాత్ర వెనక ఆంతర్యం ఏంటీ?

Rahul Gandhi: రెండు పర్యాలుగా ఓటమిని స్వీకరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రానున్న ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వివిధ కసరత్తులు ప్రారంభించింది. గతేడాదిగా బీజేపీ ప్రభుత్వం మైనస్‌ పాయింట్లు క్యాచ్‌ చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఇటీవల జరిగిన అగ్రిపథ్‌ ర్యాలీలో రైల్వేస్టేషన్ల ధ్వంసాన్ని తీసుకుని బీజీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ సారి ఎలాగైనా ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో రాహుల్‌ గాంధీ మరో అడుగు ముందుకెశారు. బీజేపీ ప్రభుత్వం లొసుగులు తాము అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధిని వివరిస్తూ రాహుల్‌ గాంధీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

‘భారత్‌జోడు’ అనే నినాదంతో ప్రారంభించనున్న పాదయాత్ర మొదట అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభించాలనుకున్నారు. ఆ తర్వాత పాదయాత్ర తేదీలో మార్పుచేసి సెప్టెంబర్‌ 7కు కుదించారు. ఈ పాదయాత్రలో భాగంగా రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాలు, ఇంధనం ధరలు, జీఎస్టీ, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న మతతత్వ గొడవలను అస్త్రాలుగా చేసుకుని పాదయాత్రల్లో తమ యువనేత రాహూల్‌ గాంధీ సంధిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాహూల్‌ గాంధీ పాదయాత్ర రానుంది. నాలుగు అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతోందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో దాదాపుగా 100 కిలో మీటర్ల పాదయాత్రలో రాహూల్‌ ప్రజలతో మాట్లాడుతూ ముందుకెళ్తారని పార్టీ నేతలు పేర్కోంటున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు రాహూల్‌ పర్యటించే ప్రాంతాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన తర్వాత ఏపీలోనూ కాంగ్రెస్‌ పుంచుకోనుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కాంగ్రెస్‌ అ«ధిష్ఠానం ఆదేశాల మేరకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలో వచ్చారని కాంగ్రెస్‌ పెద్దలు గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర పూర్తయ్యే వరకూ ప్రజల్లో బీజేపీపై అసంతృప్తి మొదలై కాంగ్రెస్‌ వైపు చూస్తారన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఇప్పుడు ఆకర్షితమైన పథకాల పేర్లతో ప్రజలను మోసం చేస్తోందని మోసపోయే పథకాలంనింటినీ కాంగ్రెస్‌ అడ్డుకుంటుందన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన పాలనే కాంగ్రెస్‌ లక్ష్యమని ఆ దిశగా రాహుల్‌ పాదయాత్ర కొనసాగుతోందని కాంగ్రెస్‌ అధిష్ఠానం పేర్కొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -