Sneha: స్నేహ భర్తతో విడిపోవడం వెనుక అసలు కారణమిదా?

Sneha: Sతెలుగుతో పాటు తమిళంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు సాధించిన హీరోయిన్ స్నేహ. తెలుగులో సంప్రదాయ బద్ధంగా, హోమ్లీ లుక్ తో కనిపించే తక్కువ మంది హీరోయిన్లలో స్నేహ టాప్ లో ఉంటుంది. ఎలాంటి వివాదాలు లేని హీరోయిన్ గా ఉన్న స్నేహకు సంబంధించిన ఓ అంశం తాాజాగా అందరిలో చర్చకు దారి తీసింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

 

సినిమా ఇండస్ట్రీలో మంచి కెరీర్ తో కొనసాగుతున్న టైంలో స్నేహ 2012లో ప్రసన్న అనే నటుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిన స్నేహ.. ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన కుటుంబంతో ఉన్న ఫోటోలను, వీడియోలను స్నేహ షేర్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.

 

 

ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటున్న స్నేహ, ప్రసన్నలు తాజాగా విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. స్నేహ పిల్లలతో సహా భర్త ప్రసన్నకు దూరంగా వేరే చోట ఉంటున్నట్లు తెలుస్తోంది. స్నేహ, ప్రసన్నలు ప్రతి చిన్న విషయానికి గొడవపడే వారని. పెళ్లికి ముందు స్నేహకు ఇచ్చిన హామీలను ప్రన్నన్న పట్టించుకోవడం లేదని, స్నేహ ఇష్టాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అందుకే ప్రసన్న నుండి విడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

కాగా సినీ ఇండస్ట్రీలో ఎంతో అన్యో యంగా ప్రతి ఫంక్షన్ కి జంటగా వచ్చే స్నేహ దంపతులు ఇప్పుడు విడిపోయారనే వార్త చాలామందికి బాధ కలిగిస్తోంది. ఇద్దరు పిల్లలను కలిగిన ఈ జంట విడిపోకుండా.. సమస్యలను కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలని నెటిజన్లు వారికి సలహా ఇస్తున్నారు. మరి ఈ ఇష్యూని స్నేహ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -