Ram Charan: అంత మంచి అవకాశాన్ని చరణ్ మిస్ చేసుకోవడానికి అసలు కారణమిదా?

Ram Charan: మెగా ఫ్యామిలీ నుంచి మెగా వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈయన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నారు.

తాజాగా రాంచరణ్ తండ్రిగా కూడా ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈయన ఉపాసన కామినేని అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇక ఉపాసన అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా చరణ్ తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

 

ఇకపోతే తాజాగా చరణ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ కు స్టార్ హీరో ఇంటికి అల్లుడు కావాల్సి ఉండేదని, అలాంటి మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారని తెలుస్తోంది.చరణ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ సక్సెస్ సాధించారు. అయితే తన తండ్రి తనకు పెళ్లి చేయాలని భావించిన సమయంలో నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ తో చరణ్ కు పెళ్లి చేయాలని భావించారట.

 

ఇదే విషయమే రామ్ చరణ్ వద్ద చిరంజీవి ప్రస్తావించగా ఇదే సరైన సమయం అని భావించిన రామ్ చరణ్ తాను ఉపాసనను ప్రేమిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో మాటల సంబంధం మాటలలోనే ఆగిపోయిందని దీంతో చరణ్ కమల్ హాసన్ ఇంటికి అల్లుడు అవకాశాన్ని కోల్పోయారని తెలుస్తోంది. కుమారుడు ప్రేమకు గౌరవం ఇచ్చినటువంటి చిరంజీవి తన కొడుకుకు ఉపాసనను ఇచ్చి పెళ్లి జరిపించారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -