Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో స్వాధీనం చేసుకున్న ఆస్తిని అక్కడ భద్రపర్చుతారు!

Income Tax:  ఓ నాయకుడి ఇంట్లో.. ఫలనా కార్యాలయం లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రైడ్‌ జరగుతున్నాయ్‌.. లెక్కకు మించి ఆస్తులు, డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఇలాంటి వర్తాలు మనం తరచుగా వింటుంటాం. స్వాధీనం చేసుకున్న డబ్బుల కట్టలను అధికారులు చూపిస్తుంటారు. కొందరి ఇళ్లలో సంచుల కొద్ది డబ్బు స్వాధీనం చేసుకుంటారు. అయితే ఆ డబ్బు ఫొటోలను చూస్తే రైడింగ్‌లో స్వాధీనం చేసుకున్న డబ్బులను ఏం చేస్తారో అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన, ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్‌ అధికారి ఒకరు తన అనుభవాన్ని ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. సెర్చింగ్‌ బృందం సభ్యులు మొదటగా ఎక్కడైతే రైడ్‌ చేయాలనుకున్నారు వారి ఇంటికొచ్చి సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చి ఆ తర్వాత సోదాలు ప్రారంభిస్తారు. వారు తనిఖీలు చేసేవరకు ఎవరిని బయటకు పంపరు. బయటి వారిని లోపలికి రానివ్వరు. అధికారులు అక్కడికక్కడే పరిస్థితిని బట్టి ఇతర నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తే అధికారుల అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి గంటల కొద్ది తనిఖీలు జరుగుతుంటాయి.. అలాంటప్పుడు వంట చేసుకోవడం, వాష్‌ రూమ్‌కు వెళ్లడానికి అవకాశం ఇస్తారు.

రైడ్‌ చేసిన వ్యక్తి నుంచి వస్తువులను జప్తు చేయడానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. కంప్యూటర్లు, సిస్టమ్‌లోని హార్డ్‌ డిస్క్, తదితరాలను స్వాధీనం చేసుకుంటారు. అక్రమంగా, లెక్కలు చెప్పని ఆస్తులు, నగదు, నగలు అన్నింటినీ జప్తు చేస్తారు. జప్తు చేసిన వాటి వివరాలను నమోదు చేసి, సంబంధిత వ్యక్తి అందజేస్తారు. అధికారులు రైడ్‌లో జప్తు చేసిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్‌ చేస్తారు. ఇందులో కమిషనర్‌కు కమిషనర్‌కు లింక్‌ చేసిన అకౌంట్స్‌ ఉంటాయి. ఆ కౌంట్స్‌లో సీజ్‌ చేసిన సొమ్మును డిపాజిట్‌ చేస్తారు. ఆ తరువాత మొత్తం ఆస్తి, ఆదాయం వివరాలను చెక్‌ చేస్తారు. ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్‌ ఎంత? వంటి వివరాలను నిర్ధారించుకుంటారు. ట్యాక్స్‌ డబ్బులు మినహా మిగతా సొమ్మును తిరిగి వారికి చెల్లిస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -