Sai Pallavi: సాయిపల్లవి కెరీర్ సంకనాకిపోయినట్టే.. ఇలాంటి పని చేయాలా?

Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫిదా సినిమాతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు రాష్ట్రాల ప్రజలతో మంచి అభిమానం సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

 

అతి తక్కువ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ చేసే సినిమాలు అని మంచి కాన్సెప్ట్ తో వస్తుంటాయి. పైగా అందులో తన పాత్రలు మాత్రం చాలా డీసెంట్ గా ఉన్నట్లు కనిపిస్తాయి. చాలా వరకు ఈ ముద్దుగుమ్మ తన సినిమాలలో పద్ధతిగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా గ్లామర్ షో చేసినట్లు కనిపించదు. అందుకే ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.

 

ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా ఎంపిక విషయంలో అస్సలు తొందర పడదని చెప్పాలి. పైగా ఎక్కువ పారితోషకం కూడా ఆశించకుండా తక్కువ పారితోషకం అయినా సరే హోమ్లీగా ఉండే పాత్రలు చేస్తుంది. అయితే సినిమాల పరంగా అంత ఆలోచించే సాయి పల్లవి ఇప్పుడు పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇంతకు అదేంటంటే..

అల్లు అరవింద్ నిర్మాణంలో దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రామాయణం ప్రాజెక్టు రూపొందనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రానుందట. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన స్టార్ నటులు ఇందులో కీలక పాత్రలో చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే సాయి పల్లవిని సీత పాత్ర కోసం తీసుకుంటున్నారని తెలుస్తుంది.

 

దీంతో ఈ సినిమా కోసం ఏకంగా రెండేళ్ల పాటు ఇతర సినిమాలకు దూరంగా ఉండనుందట సాయి పల్లవి. కేవలం సీత పాత్ర కోసం ఆమె రెండేళ్ల పాటు ఏ సినిమాలకు సైన్ చేయకుండా ఉండటానికి నిర్ణయించుకుందని తెలుస్తుంది. అయితే నిజంగా ఇదే జరిగితే మాత్రం ఆమె కచ్చితంగా రిస్క్ లో పడినట్లే. దీంతో కొందరు ప్రేక్షకులు ఇలా చేస్తే.. సాయిపల్లవి కెరీర్ సంకనాకిపోయినట్టే అని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -