Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చాక వాళ్లపై ప్రతీకారం.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Lokesh: టీడీపీ నారా లోకేష్ ప్రస్తుతం యువగలం పాదయాత్రలో భాగంగా ఏపీలోని పలు జిల్లాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే భారీగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ వైసిపి ప్రభుత్వంపై జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శిస్తున్నారు నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే మరొకసారి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే రాజకీయ నాయకుడైనప్పటికీ తన మామ బాలకృష్ణ సినిమా డైలాగులు అన్నీ కాపీ కొట్టాడు అన్న ఆరోపణలు కూడా నారా లోకేష్ పై ఇప్పటికే చాలాసార్లు వినిపించిన విషయం తెలిసిందే. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకున్నాడట.

అందులో తాను పదవిలోకొచ్చాక ఎవరెవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలో రాసుకుంటున్నాడట. ఆఖరికి చిత్తూర్ ఎస్పీ రిషాంత్ రెడ్డి పేరుని కూడా అందులో రాసుకున్నానని పబ్లిక్ గానే ఆ ఎస్పీకి వార్ణింగ్ ఇచ్చి మరీ చెప్పాడు లోకేష్. ఇది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? ప్రజలు పదవిచ్చేది దేనికి? ఇలా గుర్తు పెట్టుపెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడానికా? ఎంత అమాకత్వముంటే ఇలా పబ్లిక్ గా చెప్తాడు? మరొకవైపులా పవన్ కళ్యాణ్ కూడా..తాట తీస్తాను కొడకల్లారా అంటూ బరితెగించి మాట్లాడుతున్నాడు. ఎక్కడా అధారాల్లేని అభియోగాలు వేసి విలేజ్ వలంటీర్స్ కి సెక్స్ రాకెట్ అంటగట్టాడు పవన్. ఇక చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. పుంగనూర్ సంఘటన ఒక్కటి చాలు మితి మీరిన స్వేచ్ఛతో ప్రజాస్వామ్యం ఎలా పరిహాసం పాలయ్యిందో చెప్పడానికి.

 

పోలీసుల మీద దాడులు, పోలీస్ వాహనాలు ధ్వంసం కూడా చేసేసారు. టీడీపీ అంటే అరాచకమే అన్నట్టుగా పుంగనూర్ సంఘటన కళ్ల ముందు మెదులుతోంది. సినిమాల్లో హీరోలు విలన్స్ పై డైలాగులు కొట్టినట్టు బయట రాజకీయ నాయకులు కొడుతున్నారు. ఆ డైలాగులకి ఈలలేసే మాస్ జనం ఈ రాజకీయ పంచులకి కూడా చప్పట్లు కొడ్తున్నారని ఇంకా రెచ్చిపోతున్నారు. సినిమాలు చూసే జనం అధికంగా యువకులే. సమాజంలో కూడా యువకుల జనాభాయే ఎక్కువ. అందుకే సినిమావాళ్ల మాదిరిగా,రాజకీయ నాయకులు కూడా వాళ్లే టార్గెట్ ఆడియన్స్ అనుకుంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఛాలెంజులు, వార్ణింగులు ఇవే సరిపోతున్నాయి. ఒకప్పటి రాజకీయాలకు ఇప్పటికి రాజకీయాలకు చాలా మార్పులు వచ్చాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతీది కూడా తమాషాగా అయిపోయింది. ఇటు జనంలో,అటు నాయకుల్లోనూ సీరియస్ కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -