Telangana BJP: తెలంగాణ బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరు?

Telangana BJP: ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది తెలంగాణలో బీజేపీ నేతల పరిస్ధితి. అప్పుడే సీఎం పదవి కోసం టీ బీజేపీలో లొల్లి మొదలైంది. సీఎం అభ్యర్థి కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సీఎం అభ్యర్థి రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగా.. ఇప్పుడే ఆ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై చర్చ సాగుతోంది. బీజేపీ పైకి బలంగా కనిపిస్తున్నా.. గ్రౌండ్ లెవల్ లో ఆ పార్టీకి బలమైన క్యాడర్ లేదు. చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కూడా లేరు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో వరకు బలంగా ఉన్నాయి. గ్రామాల్లో కూడా ఇరు పార్టీలకు క్యాడర్ ఉంది. కానీ బీజేపీకి గ్రామాల్లో క్యాడర్ సరిగ్గా లేదు. దీంతో పార్టీని బలోపేతం చేసుకోవాల్సి పోయి… అప్పుడు సీఎం అభ్యర్థి కోసం పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని పలు సర్వేలు ఇప్పుడే అంచనా వేశాయి. అయితే ప్రస్తుతం బీజేపీ తరపున ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు పెంచుకుంటుందని సర్వేలలలో తేలింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉండటంతో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగే సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి.

ఇలాంటి తరుణంలో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకోవాల్సి అవసరం ఉంది. అయితే బీజేపీ నేతలు మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ టీఆర్ఎస్ తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నారు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కేసీఆర్ కు ధీటుగా విమర్శలు చేసే, మాట్లాడే గుణం బండికి ఉంది. యువతలో ఆయనకు మాస్ లీడర్ గా పేరు ఉంది. దీంతో సీఎం అభ్యర్థి రేసులో ఆయన ముందు వరుసలో ఉన్నారు.

ఇక ఈటల రాజేందర్ కూడా సీఎం రేసులో ప్రధానగా కనిపిస్తున్నారు. బీజేపీలో చేరినప్పుడే సీఎం పదవి విషయంలో ఈటల క్లారిటీ తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఆయన బీజేపీలో చేరగానే ఈటల సీఎం అంటూ ప్రచారం జరిగింది. ఇటీవల పలు సమావేశాల్లో కూడా సీఎం ఈటల అనే నినాదాలు కూడా వినిపించాయి. ఇక ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. అయితే బీజేపీ ముందుగానే సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించదు. నేతలు పోటీ పడటం తప్పితే.. కేంద్ర బీజేపీ నాయకత్వం మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -