Akkineni Heroes: ఇద్దరు అక్కినేని హీరోలలో గొప్ప హీరో ఎవరంటే?

Akkineni Heroes: నట సార్వభౌముడు అక్కినేని నాగేశ్వరరావు అప్పటి సీనియర్ స్టార్ నటుడు. నాటకరంగం ద్వారా కళారంగంలోకి అడుగు పెట్టిన ఏఎన్ఆర్.. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. ఆయన వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇప్పటికివరకు నాగార్జున 100కుపైగా సినిమాల్లో నటించారు. ‘గీతాంజలి, శివ’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ వంటి సినిమాలతో ప్రేక్షకుల మన్నన పొందాయి. రీసెంట్‌గా బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అలాగే ‘ది ఘోస్ట్’ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ.. థియేటర్ల వద్ద బోల్తా కొట్టింది.

 

నాగార్జున వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి. రెండో భార్య అమలా అక్కినేని. వీరికి నాగచైతన్య, అఖిల్ కొడుకులు. అయితే నాగార్జున కొడుకులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. పెద్ద కొడుకు నాగచైతన్య ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన ఫస్ట్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ‘ఏం మాయ చేశావో, 100% లవ్, తడాఖా, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు’ వంటి హిట్ సినిమాలు చేశారు. ఇటీవల హీరోగా నటించిన ‘థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా’ నిరాశను మిగిల్చాయి. సినిమా స్టోరీ ఎంపిక విషయంలో నాగ చైతన్య ఎంతో ఆచితూచి వ్యవహరిస్తాడని సమాచారం.

 

అఖిల్ కూడా ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సినిమాలు చేసినప్పటికీ.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదు. ప్రస్తుతం ఆయన ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఏఎన్నార్, నాగార్జున అప్పటి స్టార్ హీరోలు. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు అందించారు. యువ హీరోలైన నాగ చైతన్య-అఖిల్ మాత్రం ఊహించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీరిద్దరిలో ఎవరు గొప్ప అంశంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో నెటిజన్లు నాగ చైతన్యకే ఓటు వేస్తున్నారు. చైతన్య మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ లో ప్రత్యేక ఇమేజ్ ఉంది. సక్సెస్ రేటు కూడా అఖిల్ కంటే ఎక్కువగా ఉందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -