Tollywood: ఈ టాలీవుడ్ సీనియర్ హీరోలలో భారీగా ఆస్తులున్న హీరో ఎవరంటే?

Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది సీనియర్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈ నలుగురు మాత్రం ఒక తరం కి చెందిన వాళ్ళు అన్నట్లుగా నిలిచారు.

ఇక ఈ హీరోలు వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ముఖ్యంగా తమ ఫ్యామిలీ, ఆస్తుల విషయంలో వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ఈ హీరోలు. సంపాదించడంలో కూడా బాగానే ఉంటారని చెప్పాలి. కేవలం సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగాలలో కూడా బాగా సంపాదించుకుంటున్నారు. అయితే ఈ నలుగురు హీరోలలో బాగా ఆస్తులు ఉన్న హీరో ఒకరిని తెలిసింది. ఒకసారి ఈ నలుగురు హీరోలకు ఎన్ని ఆస్తుల విలువ ఉన్నాయి తెలుసుకుందాం.

 

బాలకృష్ణ: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కుర్ర హీరో లాగా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఈ వయసులో కూడా వరుస సినిమాలకు సైన్ చేస్తూ కూతురు వయసున్న హీరోయిన్లతో తెగ రొమాన్స్లు చేస్తున్నాడు. అయితే ఈయన సినిమా రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా బాగా సంపాదించుకుంటున్నాడు. ఇక ఈయనకు మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

 

చిరంజీవి: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి కూడా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారాడు. తన వారసులతో పోటీగా ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్నాడు. ఇక చిరంజీవి కూడా సినిమాల పరంగానే కాకుండా వ్యాపారాల పరంగా కూడా బాగా సంపాదించుకుంటూ పోతున్నాడు. ఇక ఈయనకు మొత్తం రూ.8 వేల కోట్ల వరకు ఆస్తుల విలువ ఉందని తెలుస్తుంది.

 

వెంకటేష్: ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అనగానే వెంటనే గుర్తుకొచ్చే హీరో వెంకటేష్ అని చెప్పాలి. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు వెంకటేష్. ఇక ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేస్తున్నాడు వెంకటేష్. ఇక ఈయనకు కూడా వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈయన ఆస్తుల విలువ రూ.6 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది.

 

నాగార్జున: టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గా పేరు సంపాదించుకొని ఎంతోమంది అమ్మాయిలకు మన్మధుడుగా నిలిచాడు. ఈ వయసులో కూడా ఈయన కుర్ర హీరో లాగా కనిపిస్తూ ఉంటాడు. కేవలం హీరో గానే కాకుండా వ్యాఖ్యతగా కూడా చేశాడు. ఈయనకు కూడా బాగానే బిజినెస్ లు ఉండగా ఇప్పటివరకు ఆయన రూ. 13 వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్నాడు అని తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -