Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ అక్కడ ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. మ్యాజిక్ చేస్తారా?

Mrunal Thakur: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ చేస్తూనే మరోవైపు మరాఠి సినిమాలలో నటించారు అయితే సినిమాలలో పెద్దగా ఈమెకు గుర్తింపు రాలేదని చెప్పాలి అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఈమె తెలుగు సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

 

తెలుగులో మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ లభించింది ఇక తెలుగులో మంచి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ లభించింది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుసగా తెలుగు సినిమా అవకాశాలు వస్తున్నాయి ఇదివరకే నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా మారినటువంటి ఈమె పట్ల కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కన్నేసింది.

 

కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు వరుసగా మూడు సినిమాలలో అవకాశాలు ఎదురుచూస్తున్నాయని సమాచారం. మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో ఈమెను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అదే విధంగా కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో హీరో శింబు నటించబోయే సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ నటించే అవకాశాలను అందుకుంటున్నారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా మరొకసారి హీరో అజిత్ సరసన కూడా ఈమె నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా హిందీ మరాఠీ తెలుగు భాషలలో అందరిని ఆకట్టుకున్నటువంటి ఈమె ఇక పై కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -