AP Assembly Elections: జగన్ బాబు పవన్.. క్రోధి నామ సంవత్సరంలో పవర్ సొంతమయ్యేది ఎవరికంటే?

AP Assembly Elections: శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త ఏడాడిలో ఉన్న జాతకం ఎలా ఉండబోతుందని తెలుసుకోవడం కోసం ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా త్వరలోనే ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి తరుణంలో ఏ రాజకీయ నాయకుడి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు అయితే వచ్చే ఎన్నికలలో కూడా తానే అధికారంలోకి రావాలని భావిస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు పోయిన అధికారాన్ని తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు.

మరోవైపు జనసేన పార్టీ స్థాపించి పది సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చట్టసభలలోకి అడుగుపెట్టలేదు. ఎలాగైనా ఈసారి తాను అసెంబ్లీలోకి వెళ్లాలని ఆయన కూడా గట్టిగా ఉన్నారు. మరి ఈ ముగ్గురి జాతకాలని శ్రీ క్రోధి నామ సంవత్సరం ఏమని చెబుతుందనే విషయానికి వస్తే..

జగన్ ది మిధున రాశి ఆరుద్ర నక్షత్రంగా ఉంది. ఆయనకు అందువల్లనే పట్టుదల చాలా ఎక్కువ అని అంటున్నారు. ఆయనకు రవి కుజులు గ్రహాల ప్రోత్సాహంతో ఆయన రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు అయితే కాస్త కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు కృత్తిక నక్షత్రం. ఆయనకు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నారని అంటున్నారు. ఆయనకు దశాంతర దశలు కలసి రాకనే గడచిన కాలంలో ఇబ్బందిలో పడ్డారని అంటున్నారు. బాబు రాశి వృషభ రాశి గా ఉంది. ఆయన రాజకీయ జీవితంలో చాలా గట్టిగానే కష్టపడాల్సి ఉంటుంది.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాడ నక్షత్రం. మకరరాశి. ఆయనకు ఏలినాటి శని నడుస్తోంది. ఆయనకు ప్రస్తుతం ఒడిదుడుకులుగా రాజకీయం అంతా నడుస్తోందని అంటున్నారు. ఆయనకు మే తరువాత కొంత బాగుంటుందని,పంచమ స్థితిలో బృహస్పతి రావడం వలన ఆయన రాజకీయంగా కొంత పట్టు సాధిస్తారు. అని అంటున్నారు. ఆయన ఈసారి తప్పకుండా అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -