YS Avinash Reddy: వివేకాది గుండెపోటు మరణమని అవినాష్ రెడ్డి అందుకే చెప్పారా?

YS Avinash Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సిబిఐ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిబిఐ అధికారులు కొందరిని అరెస్టు చేసే విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక అవినాష్ రెడ్డి కూడా అరెస్టు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈనెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకూడదని సిబిఐ అధికారులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా అంతవరకు ప్రతిరోజు అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల వద్దకు విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇక ఈయన చెప్పే సమాధానాలు రాతపూర్వకంగానూ అలాగే ఆడియో వీడియో రూపంలో చిత్రీకరించాలని పేర్కొన్నారు.2019 ఎన్నికల సమయం ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు గురై మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ హత్య కేసును ఏపీ ముఖ్యమంత్రి సీఎం సీబీఐకు అప్పగించారు. అయితే సిబిఐ ప్రస్తుతం ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసు వైయస్ కుటుంబం మెడకు ఉచ్చుల బిగుసుకుంది. ఇక హత్యకు ముందు రోజు అవినాష్ ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నారని సునీల్ యాదవ్ ఆయుధాన్ని తీసుకెళ్లి వివేకానంద రెడ్డి పై హత్యకు దాడి చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఉదయ్ కుమార్ రెడ్డి సునీల్ యాదవ్ కు అవినాష్ రెడ్డికి మధ్య సంబంధం ఏంటో తెలుసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

సునీల్ యాదవ్ ఉదయ్ కుమార్ యాదవ్ ఇద్దరూ కూడా హత్య జరిగిన రోజు అవినాష్ ఇంట్లోనే ఉన్నారని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయం తెలియగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాశ్ రెడ్డి వివేకానంద రెడ్డి శరీరంపై గాయాలు కనపడకుండా కట్టు కట్టారు. అలాగే సంఘటన స్థలంలో ఎలాంటి సాక్షాలు లేకుండా చెరిపివేశారు.ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలనీ అధికారులు వివేకానంద రెడ్డి హత్యకు గురైన ఆయన ఎందుకు గుండెపోటుకు గురయ్యారో తెలుసుకోవాలని తెలిపారు.ఇలా ఈ విషయాలన్నీ బయటపడితే అవినాష్ రెడ్డి అరెస్టు తద్యమని ఈయనకు బెయిల్ రావడం కూడా చాలా కష్టమని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -